తెలుగోళ్లకి తెలుగువారే శత్రువులు.. అక్కినేని కోడలు షాకింగ్ కామెంట్స్!

తెలుగోళ్లకి తెలుగువారే శత్రువులు.. అక్కినేని కోడలు షాకింగ్ కామెంట్స్!

అక్కినేని ఇంటి కోడలు, నటి శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.. మనసమాజంలోనే ఒకరి ఎదుగుదలను మరొకరు చూడలేరంటూ ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన వీడియోపై స్పందించారు. సొంత మనుషుల మైండ్‌సెట్‌పై శోభిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సొంతవాళ్లే శత్రువులు..

హైదరాబాద్‌కు చెందిన అహల్య అనే ఇన్‌ఫ్లుయెన్సర్ 'ఒక తెలుగు వ్యక్తికి అసలైన శత్రువు మరొక తెలుగు వ్యక్తే' అని ఒక వీడియో షేర్ చేసింది. కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలని ప్రయత్నం మొదలుపెడితే ప్రోత్సహించాల్సింది పోయి, ఇందులో అంత గొప్పేముంది? అని చిన్నచూపు చూస్తారని సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌కు శోభిత  మద్దతు తెలుపుతూ తన చేదు అనుభవాలను పంచుకున్నారు.

16 ఏళ్లకే ఇల్లు వదిలి...

తన మనసులోని మాటను బయటపెడుతూ.. నేను కేవలం 16 ఏళ్ల వయసులోనే బ్యాగులు సర్దుకుని ముంబయికి వెళ్లిపోయా. అక్కడ సక్సెస్ అవుతానో లేదో గ్యారెంటీ లేదు. కానీ మన వాతావరణంలో కలలు కనేవారిని, కొత్తగా ఏదైనా సాధించాలనుకునే వారిని తొక్కేసే మనస్తత్వమే ఎక్కువ. ఇక ఆ ప్రయత్నం చేసేది ఒక మహిళ అయితే ఆ ప్రతికూలత రెట్టింపు అవుతుంది అని రాసుకొచ్చింది. అయితే ఇది ఒకప్పటి మాట అని, ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆశిస్తున్నట్లు శోభిత తెలిపింది.

ALSO READ : అట్లీ 'రాకా' నుంచి '37' కౌంట్‌డౌన్ పోస్టర్.. 

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించిన శోభిత.. 'మిస్ ఎర్త్ 2013' రన్నరప్‌గా నిలిచి గుర్తింపు తెచ్చుకుంది. 2016లో 'రామన్ రాఘవ్ 2.0'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత 'గూఢచారి', 'పొన్నియిన్ సెల్వన్', 'మేడ్ ఇన్ హెవెన్', 'ది నైట్ మేనేజర్' వంటి ప్రాజెక్ట్‌లతో గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది.