Allu Arjun: అట్లీ 'రాకా' నుంచి '37' కౌంట్‌డౌన్ పోస్టర్.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్!

Allu Arjun: అట్లీ 'రాకా' నుంచి '37' కౌంట్‌డౌన్ పోస్టర్.. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'రాకా' (Raaka) . వీరి కాంబోలో ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వైవిధ్యమైన సైన్స్ ఫిక్షన్-యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల మేకర్స్ ఎక్స్ వేదికగా కేవలం '37' అనే నెంబర్‌ను షేర్ చేయడంతో నెట్టింట #WhatisRaaka37 హ్యాష్‌ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది

ఈ క్రేజీ సస్పెన్స్ సంఖ్య వెనుక అసలు రహస్యం ఏమై ఉంటుందనే దానిపై అల్లు అభిమానులు, నెటిజన్లు ఆసక్తికరమైన అంచనాలు వేస్తున్నారు. సెప్టెంబర్ 21న డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు కావడం, ఆ తేదీకి '3×7 = 21' అంటూ  ఫ్యాన్స్ వినూత్న లాజిక్ జోడిస్తున్నారు. ఆ రోజే ఈ సినిమా నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ లేదా టీజర్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే చిత్రంలో అల్లు అర్జున్ డిఫరెంట్ షేడ్స్ లేదా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన క్లూ అయి ఉంటుందని భావిస్తున్నారు

ALSO READ : శ్రీదేవి ఆస్తిపై లీగల్ వార్.. బోనీ కపూర్, జాన్వీలకు సుప్రీంకోర్టు నోటీసులు!

 బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్, షారుఖ్ ఖాన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు సినిమా రేంజ్‌ను మరింత పెంచాయి. రెండు భిన్నమైన టైమ్‌లైన్స్‌లో, ఎవరూ ఊహించని సరికొత్త కథాంశంతో అట్లీ ఈ చిత్రాన్ని మలుస్తున్నారని సమాచారం.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంగర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.  అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ విజువల్ స్పెక్టకిల్‌గా తెరకెక్కుతున్న 'రాకా' నుంచి రాబోయే ఆ అధికారిక సర్ప్రైజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు..