iPhone 18 Pro: భార్యకు గిఫ్ట్ ఇచ్చేందుకు గోల్డ్ అమ్మిన వ్యక్తి.. iPhone 18 Pro మ్యానియా మామూలుగా లేదుగా!

iPhone 18 Pro: భార్యకు గిఫ్ట్ ఇచ్చేందుకు గోల్డ్ అమ్మిన వ్యక్తి.. iPhone 18 Pro మ్యానియా మామూలుగా లేదుగా!

దీన్ని క్రేజీ అనాలో.. మ్యానియా అనాలో లేక పిచ్చి అనాలో తెలియదు కానీ.. ఐఫోన్ 18 ప్రో రిలీజ్ కోసం జనాలు ఎగబడతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ధర ఎంత పెరిగినా పర్లేదు భరిస్తాం.. ఈఎంఐ పెరుగుతుందేమో.. భరిస్తాం.. కానీ ఐ ఫోన్ కొనకుండా ఉండలేం అంటూ ఆపిల్ స్టోర్స్ ముందు క్యూ కట్టారు. ఇందులో ఒక వ్యక్తి తన భార్య కోసం బంగారం అమ్మేసి 18 ప్రో కొనటం వైరల్ గా మారింది. 

2026 సెప్టెంబర్ 18న iPhone 18 Pro సేల్స్ ఇండియాలో ప్రారంభమయ్యాయి. ముందు రోజు రాత్రి నుంచే ఆపిల్ స్టోర్స్ ముందు జనాలు క్యూ కట్టారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై వంటి సిటీలలో నిద్రాహారాలు మాని ఐఫోన్ కోసం క్యూలో నిల్చున్నారు. 

నోయిడాలో ఒక వ్యక్తి తన భార్యకు గిఫ్టుగా ఇచ్చేందుకు బంగారం అమ్మినట్లు తెలిపాడు. బర్గండీ కలర్ ఫోన్ కావాలని మా వైఫ్ కోరింది. అందుకే గోల్డ్ అమ్మేసి ఆమె కోసం ఫోన్ కొంటున్న అని చెప్పాడు. ఆమె ఐఫోన్ యూజర్ కాదు కానీ.. ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాను. ప్రస్తుతం డబ్బులు ఉన్నాయి. ఇంతకు ముంతు లేకుండే. ముందు ముందు ఉంటాయో లేదో తెలియదు. ఉన్నపుడే కావాల్సింది కొనుకోవాలి. అందుకే బంగారం అమ్మేసి కొంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. 

ఫియాన్సీ కోసం ఢిల్లీ వచ్చిన వ్యక్తి:

ఐఫోన్ కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు చాలామంది. గుర్దితా సింగ్ అనే వ్యక్తి ఐఫోన్ కోసం ఢిల్లీకి వెళ్లటం అక్కడ ఉన్న వాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలో తన పెళ్లి ఉందని.. తన ఫియాన్సీకి గిఫ్ట్ ఇచ్చేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పాడు. 

ఇప్పుడు ఒకే ఫోన్ కొన్నాం.. నెక్స్ట్ రెండు ఫోన్లు కొంటాం:

ఢిల్లీ స్టోర్ లో కపుల్ ఇద్దరూ కలిసి ఐఫోన్ కొన్నారు. ఇప్పుడు ఒకే ఫోన్ కొంటున్నాం.. కానీ నెక్స్ట్ టైమ్ రెండు ఫోన్లు ఒకేసారి కొంటాం అంటూ ఐఫోన్ పై తమ ఇష్టాన్ని పంచుకున్నారు. 

ALSO READ : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సేల్స్ షురూ: 

ఎంత రేటైనా భరిస్తాం:

ఐ ఫోన్ రేట్లు భారీగా పెరిగాయి కదా అనే ప్రశ్నకు.. ఎంతైని భరిస్తాం అంటూ చెప్పడం ఫోన్ పైన ఉన్న క్రేజ్ ఏంటో స్పష్టం చేస్తోంది. హర్యానాకు చెందిన విశాల్ అనే వ్యక్తి.. రేట్ డబల్ అయ్యింది కదా అంటే.. నో ప్రాబ్లమ్.. మేనేజ్ చేస్తాం అంటూ సమాధానం చెప్పాడు. 

ప్రీఆర్డర్ ఉన్నవాళ్లకే..

ఐఫోన్ రిలీజైన సందర్భంగా ఎవరు పడితే వాళ్లు స్టోర్స్ కు వెళితే ఇవాళ ఐఫోన్ దొరకడం కష్టం. ప్రీ ఆర్డర్ చేసిన వాళ్లకే మొదటి రోజు ఫోన్లు ఇస్తున్నారు. ఆర్డర్ చేయని వాళ్లకు ఫోన్లు లేవని ముందుగానే చెప్పే్తున్నారు. 

కొందరు ఆర్డర్ చేయకుండా షాపులోకి వెళ్లి నిరాశచెందుతున్నారు. ప్రీ ఆర్డర్ చేయాలని మాకు తెలియదు. తెలిస్తే చేసేవాళ్లం. డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పినా ఇవ్వడం లేదు. మరి కొన్ని ఆగాల్సిందేనా.. అంటూ డిజప్పాయింట్ అవుతున్నారు.