చిన్నారి స్టెల్లాకు అండగా సీఎం ప్రజావాణి..మందుల కోసం నెలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం

చిన్నారి స్టెల్లాకు అండగా సీఎం ప్రజావాణి..మందుల కోసం నెలకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తొమ్మిదేళ్ల చిన్నారి స్టెల్లాకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది.చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం ప్రజావాణి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్, ప్రణాళికా మండలి వైస్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి.. స్టెల్లాకు అవసరమైన మందులు నిరంతరం అందేలా చర్యలు తీసుకున్నారు.

స్టెల్లా చికిత్సకు ప్రతి నెలా రూ.10 వేలు మందులకు అందేలా ఏర్పాట్లు చేసి, శుక్రవారం ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టెల్లా తల్లి కవితకు మెడిసిన్ కిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న కవిత ఒంటరిగా తన కుమార్తెను చూసుకుంటున్నారు. వైద్య ఖర్చులు భారంగా మారడంతో ఇటీవల సీఎం ప్రజావాణిని ఆశ్రయించి తన పరిస్థితిని గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు.ఆమె  వినతిపై వెంటనే స్పందించిన విజయలక్ష్మి, చిన్నారికి అవసరమైన మందులు మధ్యలో ఆగకుండా అందేలా చర్యలు తీసుకున్నారు.