పెబ్బేరు పట్టణంలో పర్మిషన్ లేని ప్రైవేట్ స్కూల్ సీజ్

పెబ్బేరు పట్టణంలో పర్మిషన్ లేని ప్రైవేట్ స్కూల్ సీజ్

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో పర్మిషన్​ లేకుండా కొనసాగుతున్న ఓ ప్రైవేటు స్కూల్​ను శుక్రవారం పెబ్బేరు ఎంఈవో జయరాములు తన సిబ్బందితో కలిసి తనిఖీ చేసి సీజ్​ చేశారు.  వివరాల్లోకి వెళ్తే.. పెబ్బేరులో సంస్కార్ ఇంటర్నేషనల్​ అనే పేరుతో స్కూల్​ రన్​ చేస్తూ ఎర్రవల్లి మండలకేంద్రంలోని స్కూళ్ల పేరుతో స్టూడెంట్స్​ను ఆన్​లైన్ లో నమోదు చేసుకున్నట్లు గుర్తించారు. 

వెంటనే ఆ స్టూడెంట్స్​ను ఆయా స్కూళ్లకు పంపించాలని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యాశాఖ నుంచి గుర్తింపు పొందకుండా పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నందున వెంటనే స్కూల్​ను సీజ్​ చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు. కార్యక్రమంలో పెబ్బేరు కాంప్లెక్స్ హెచ్​ఎం నరసింహ గౌడ్, ఎంఐఎస్​ కో-ఆర్డినేటర్​ వెంకటేశ్, ఎంఆర్​సీ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.