- 32 రకాల యాంటీబయాటిక్స్, ఎక్స్పైరీ మెడిసిన్స్సీజ్
ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ బకారంలోని మహావీర్ మెడికల్స్ పై టీజీ సేఫ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడి చేశారు. నిర్వాహకుడు జయేశ్ అరవింద్ జైన్ లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. యాంటీబయాటిక్స్, హైబీపీ, యాంటీ ఫంగల్, పెయిన్ కిల్లర్స్తోపాటు గడువు ముగిసిన 32 రకాల మందులను సీజ్ చేశారు. ల్యాబ్ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు.
లైసెన్స్ లేని షాపులకు మందులు ఇస్తున్న హోల్‌సేలర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని, చట్టవిరుద్ధంగా మందులు అమ్మితే ఐదేండ్ల వరకు జైలు శిక్ష పడుతుందని అధికారులు హెచ్చరించారు. అక్రమ ఔషధాల విక్రయాలపై ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ తనిఖీల్లో సికింద్రాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ టి.రాజమౌళి, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు రేణుక, అనిల్, సురేంద్రనాథ్ పాల్గొన్నారు.
