విద్యార్థులు సామాజిక బాధ్యతను పెంచుకోవాలి : నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

విద్యార్థులు సామాజిక బాధ్యతను పెంచుకోవాలి :  నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : డిగ్రీ విద్యార్థులు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన తెలుగు భాష, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు లో ఆయన మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వాటి ఆధునిక సాంకేతిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 

విద్యార్థులు డిగ్రీతోపాటు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్​లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో బీఎస్ఎన్ఎల్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు. అవసరమైన టవర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.