అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే ఉంచడంతో, ఈరోజు (జూలై 30) గురువారం ఉదయం బంగారం ధరలు కాస్త పెరిగాయి. అమెరికా కేంద్ర బ్యాంకు (ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించింది. అయితే, బుధవారం జరిగిన భేటీలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఫెడరల్ రిజర్వ్.. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అణచివేయడమే మా ముఖ్య లక్ష్యమని ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో భవిష్యత్తులో వడ్డీ రేట్ల విషయంలో కేంద్ర బ్యాంకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై మార్కెట్లలో కాస్త గందరగోళం నెలకొంది.
ఇదిలా ఉంటే, మరో కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. అమెరికా బలగాలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా.. అమెరికా సైన్యం బుధవారం రాత్రి ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కొద్దిరోజులుగా శాంతించిన వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.
ఈ రోజు(జూలై 30) గురువారం 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.82 పెరిగి రూ.14,433, 22 క్యారెట్ల బంగారం ధర రూ.75 పెరిగి రూ.13,230, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 62 పెరిగి రూ.10,825
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,44,330, 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,32,300, 18 క్యారెట్ల బంగారం ధర రూ.620 పెరిగి రూ.1,08,250.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,300, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,250.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,300, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,250.
ఇక వెండి విషయానికి వస్తే 1 గ్రాము వెండి ధర రూ.235 ఉండగా, కేజీ ధర రూ.2,35,000
