బాలింతల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం కావాలి..: బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ 

బాలింతల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం కావాలి..: బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ 
  • పబ్లిక్ ప్లేసుల్లో ఫీడింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్స్ ఏర్పాటు చేయాలి: బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: బహిరంగ ప్రదేశాల్లో గౌరవప్రదమైన వాతావరణంలో బాలింతలు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలు కల్పించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కోరారు. గురువారం ఆయన రాజ్యసభలో జీరో అవర్‌‌‌‌‌‌‌‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ఉన్నా, పబ్లిక్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లలో తల్లుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం లేదన్నారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్ టెర్మినల్స్, కోర్టులు, యూనివర్సిటీలు, పార్కులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫీడింగ్ రూమ్స్, బేబీ ఛేంజింగ్ స్టేషన్లు, హ్యూమన్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు.

అన్ని జిల్లాల స్థాయిలో జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పించేలా కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. మహిళల ప్రైవసీని కాపాడేందుకు ఇప్పటికే అడ్వైజరీలు జారీ అయినప్పటికీ, ఇది జాతీయ ప్రజా విధానంగా మారాలని సూచించారు. మిషన్ శక్తి ద్వారా అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల నుంచి మద్దతు అందుతున్నా.. తల్లులు, శిశువుల సంరక్షణ కోసం సమగ్ర చట్టం ఎంతో అవసరమని లక్ష్మణ్ పేర్కొన్నారు.