బడా గణపతి దర్శనానికి ఒక్క రోజే 4.50 లక్షల మంది

బడా గణపతి దర్శనానికి ఒక్క రోజే 4.50 లక్షల మంది

ఖైరతాబాద్‌‌ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఏడో రోజు ఆదివారం వీకెండ్‌‌ కావడంతో నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు దర్శనానికి పోటెత్తారు.

ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దర్శనానికి రెండు గంటలు, సాయంత్రం మూడున్నర గంటలు పట్టింది. ఒక్కరోజే సుమారు 4.50 లక్షల మంది భక్తులు మహాగణపతిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌‌, ఏఐసీసీ సెక్రటరీ సచిన్‌‌ సావంత్‌‌తో కలిసి మహాగణపతిని దర్శించుకున్నారు. గణేశ్​ ఉత్సవ కమిటీ చైర్మన్‌‌, తాజా మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌ వారికి స్వాగతం పలికారు.    - పంజాగుట్ట, వెలుగు