దేశవ్యాప్తంగా రూ.69,346 కోట్ల బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు

దేశవ్యాప్తంగా రూ.69,346 కోట్ల బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు
  •     తెలంగాణలో 187.5 మెగావాట్ల సామర్థ్యంలో స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: సంప్రదాయ బొగ్గు గనుల కార్యకలాపాలకు పరిమితం కాకుండా ఇంధనం, ఖనిజాలు, అధునాతన పదార్థాలు, పరిశోధన–అభివృద్ధి రంగాల్లోకి కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీఐఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) విస్తరిస్తోన్నట్లు కేంద్రం వెల్లడించింది. సాంకేతిక ఆధారిత వైవిధ్యీకరణలో భాగంగా బొగ్గు గ్యాసిఫికేషన్, థర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, కీలక ఖనిజాలు, అధునాతన సాంకేతికతలపై దృష్టిపెట్టినట్లు తెలిపింది.

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాసిఫికేషన్, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–టు–కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలో సుమారు రూ.69,346 కోట్లతో 4 ప్రధాన ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ఆదివారం కేంద్ర బొగ్గు గనుల శాఖ వెల్లడించింది. వీటిలో యూరియా, అమ్మోనియం నైట్రేట్, సింథటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేచురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి ప్రాజెక్టులు ఉన్నాయి. సుమారు 550 మెగావాట్ల సౌర విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామర్థ్యాన్ని ఇప్పటికే కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఏర్పాటు చేసింది. గోరఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చిల్వా తాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20 మెగావాట్ల గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుసంధానిత ఫ్లోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టును కూడా చేపడుతోంది. తెలంగాణలోని చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 187.5 మెగావాట్లు/750 మెగావాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టును చేపడుతోంది.