పంజాగుట్ట, వెలుగు: పెంపుడు కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వెతికి పట్టుకోవాలంటూ పోలీసులను వేడుకున్నాడు.
పంజాగుట్ట పోలీస్స్టేసన్ పరిధిలో బీఎస్ మక్తా కుందన్‌బాగ్‌కు చెందిన ధనుంజయ్ నాయక్ తమ ఇంటి కాంపౌండ్‌లో ఉన్న లాబ్రడార్ జాతికి చెందిన పెంపుడు కుక్క ‘బ్లేజ్’ శనివారం నుంచి కనిపించకుండా పోయింది.
దీంతో ఎవరో తన కుక్కను తస్కరించారని ధనుంజయ్నాయక్ ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపారు.
