డీల్ సెట్.. అమెరికాపై హౌతీలు దాడి చేయరు: ట్రంప్

డీల్ సెట్.. అమెరికాపై హౌతీలు దాడి చేయరు: ట్రంప్

వాషింగ్టన్: యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ రెబెల్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవగాహనకు వచ్చినట్లు ప్రకటించారు. అమెరికాపై తాము ఎలాంటి దాడులు చేయబోమని హౌతీలు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు, అమెరికా కీలక మిత్రదేశమైన సౌదీ అరేబియాపై హూతీలు క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్నారు. రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న తరుణంలో, అమెరికా హౌతీలతో సంప్రదింపులు జరుపుతూ ఈ ఒప్పందానికి రావడం గమనార్హం.