వర్ధన్నపేట, వెలుగు: వరంగల్జిల్లా వర్ధన్నపేటలోని పోస్టుమార్టం గదిలో డెడ్‌బాడీ కన్నును ఎలుకలు ఘటన జరిగింది. రాయపర్తి మండలకేంద్రం శివారులోని డబుల్బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్న గారే వీరయ్య(55) శనివారం హైవే వెంట నడుచుకుంటూ వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయాడు. పోలీసులు అతడి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట మార్చురీకి తరలించారు.
పోస్ట్‌మార్టం పూర్తి కాకపోవడంతో డెడ్‌బాడీని మార్చురీలో భద్రపరిచారు. కాగా ఎలుకలు వీరయ్య కన్నును కొరకడంతో గాయాలయ్యాయి. దీనిపై కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీలో కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు.
