ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 480 పోస్టులతో UPSC ESE నోటిఫికేషన్

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 480 పోస్టులతో UPSC ESE నోటిఫికేషన్
  •  


కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ –ఏ, గ్రూప్–బీ ఇంజినీరింగ్ సర్వీసెస్ పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్​సీ)ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) 2027 నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది.   సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభం కాగా, అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. 
ఎగ్జామ్ పేరు: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2027 (ఈఎస్ఈ 2027).
మొత్తం ఖాళీలు: 480. ఇందులో దివ్యాంగులకు19 పోస్టులు కేటాయించారు.  
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ/ బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 2027, జనవరి 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్  అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 16.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇతరులు రూ.200 చెల్లించాలి. 
లాస్ట్ డేట్: అక్టోబర్ 6.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (స్టేజ్–I): 2027, జనవరి 31.
మెయిన్ ఎగ్జామినేషన్ (స్టేజ్–II): 2027, జూన్ 18. 
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ upsconline.nic.inను సందర్శించండి. 
పర్సనాలిటీ టెస్ట్ 
మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను చివరి దశ అయిన ఇంటర్వ్యూకు పిలుస్తారు.  అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంజినీరింగ్ ప్రాక్టికల్ అప్లికేషన్లపై అవగాహన, మానసిక సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు. 
తుది మెరిట్ జాబితా
ప్రిలిమ్స్ మార్కులు కేవలం మెయిన్స్ అర్హత కోసం మాత్రమే. ఫైనల్ ర్యాంకింగ్‌‌లో కలపరు. మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తారు.

యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ/ ఐఎస్ఈ) పరీక్షా విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుంది.   
స్టేజ్-1– ప్రిలిమినరీ పరీక్ష
ఇది అర్హత పరీక్ష మాత్రమే. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి.  పేపర్–1లో జనరల్ స్టడీస్ & ఇంజినీరింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 200 ప్రశ్నలు 200 మార్కులకు, సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్ నుంచి 300 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు. 
నెగెటివ్ మార్కింగ్: ప్రిలిమ్స్ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు (0.33) మార్కులు కోత కోస్తారు.
స్టేజ్-2– మెయిన్ పరీక్ష
ప్రిలిమ్స్​లో అర్హత సాధించిన అభ్యర్థులకు కన్వెన్షనల్ (డిస్క్రిప్టివ్/ వ్యాసరూప) విధానంలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి ఎంచుకున్న ఇంజినీరింగ్ బ్రాంచ్‌‌కు సంబంధించిన రెండు పేపర్లు ఉంటాయి. సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్​పై 600 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.