నాగోయా: ఐచి–నాగోయా ఆసియా క్రీడల వుషూ పురుషుల చాంగ్‌క్వాన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు సూరజ్ సింగ్ మయాంగ్లాంబమ్ 11వ స్థానంలో నిలిచాడు. ఐచి ప్రిఫెక్చురల్ మార్షల్ ఆర్ట్స్ హాల్‌లో ఆదివారం జరిగిన పోటీలో 21 మంది పాల్గొనగా సూరజ్ 9.683 పాయింట్లు సాధించాడు. కదలికల నాణ్యతకు (ఏ–స్కోర్) 5.00, కఠినత స్థాయికి (సీ–స్కోర్) 2.00 పాయింట్లు దక్కించుకున్నాడు.
ఎలాంటి డిడక్షన్ లేకపోయినా ఓవరాల్ పెర్ఫార్మెన్స్‌లో (బీ–స్కోర్) 2.683 పాయింట్లు సాధించాడు. మకావుకు చెందిన కువాంగ్ చి హిన్ 9.723 పాయింట్లతో స్వర్ణం, చి కువాన్ సాంగ్ 9.720తో రజతం గెలిచారు. సూరజ్‌కు పతకానికి కేవలం 0.040 పాయింట్ల దూరంలో నిలిచాడు. చాంగ్‌క్వాన్‌లో వేగవంతమైన పంచ్‌లు, కిక్‌లు, గాల్లో విన్యాసాలతో కూడిన కుంగ్‌ఫూ కదలికలను సుమారు 90 సెకన్లలో ప్రదర్శించాల్సి ఉంటుంది.
