హైదరాబాద్‌‌‌‌ రంజీ జట్టుకు కెప్టెన్‎గా సిరాజ్‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌ రంజీ జట్టుకు కెప్టెన్‎గా సిరాజ్‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌: రంజీ ట్రోఫీ 2026–27 సీజన్‌‌‌‌ తొలి రెండు మ్యాచ్‌‌‌‌లకు హైదరాబాద్‌‌‌‌ జట్టును హెచ్‌‌‌‌సీఏ ప్రకటించింది. స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా, సి.వి. మిలింద్‌‌‌‌ వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా ఎంపికయ్యారు. తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, అభిరత్‌‌‌‌ రెడ్డి, తనయ్‌‌‌‌ త్యాగరాజన్‌‌‌‌, అనికేత్‌‌‌‌ రెడ్డి తదితరులకు జట్టులో చోటు దక్కింది. ఎలైట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–బిలో ఉన్న హైదరాబాద్‌‌‌‌ అక్టోబర్‌‌‌‌ 11 నుంచి 14 వరకు త్రిపురతో తొలి మ్యాచ్‌‌‌‌ ఆడనుంది. అనంతరం విజయనగరం వేదికగా ఆంధ్రతో రెండో మ్యాచ్‌‌‌‌లో తలపడనుంది. 

అయితే ఈ రెండు మ్యాచ్‌‌‌‌లకే సిరాజ్‌‌‌‌ అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌‌‌‌ పర్యటనకు భారత జట్టుతో కలిసి వెళ్లనున్నాడు. ఇక కల్నల్‌‌‌‌ సి.కె. నాయుడు ట్రోఫీకి అండర్‌‌‌‌–23 జట్టును కూడా హెచ్‌‌‌‌సీఏ ప్రకటించింది. అమన్‌‌‌‌ రావు కెప్టెన్‌‌‌‌గా, ఆరోన్‌‌‌‌ జార్జ్‌‌‌‌ వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరించనున్నారు. అక్టోబర్‌‌‌‌ 12న రైల్వేస్‌‌‌‌తో, 19న ఉత్తరాఖండ్‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌ ఆడనుంది.