ఈ వారంలో( సెప్టెంబర్ 20-26): కుజుడు కర్కాటక రాశిలో.. బుధుడు చిత్తా నక్షత్రంలో సంచరించనున్నారు. ఇంకా గణేశుడి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. గ్రహాల ప్రభావం. ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది..ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది.ఈ వారం ఎవరికి అదృష్టం వరిస్తుందో పూర్తి వివరాలను తెలుసుకుందాం..!
మేషరాశి : ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వారిపై అధికారులు, సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. పనిలో అద్భుతమైన పనితీరు కారణంగా మీకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. సొంత స్థానంలో ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలను ఆశించవచ్చు. మీ పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు లభిస్తాయి. ఇది మిమ్మల్ని సంతోషపరిచే సమయం. ఈ నెల విద్యార్థులకు మంచిది. ఇది ఆర్థిక ప్రశాంతతను తెచ్చిపెట్టే సమయం. గతంలో చేసిన కష్టానికి ఫలాలు ఆగస్టు నెలలో రెట్టింపు అవుతాయి. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వారం ప్రారంభంలో చాలా జాగ్రత్తగా ఉండాలనిపండితు సూచిస్తున్నారు. కఠోర శ్రమ వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. అయినా మీ తెలివి తేటలతో అధిగమిస్తారు. కొన్ని అనవసర ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు వారం చివరిలో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు జాబ్ లభించే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికపరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీ అనుకూలంగా మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి అధికంగా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా సవ్యంగా సాగిపోతుందని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు పండితులు.కొన్ని విషయాల్లో ఓర్పు.. సహనం పాటించాలి. ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికలను రూపొందించుకుని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు
సింహ రాశి: ఈ రాశి వారు ఈ వారం ఈఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉందని జ్యోతిష్య పండితుతు చెబుతున్నారు.. . ఉద్యోగంలో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఊపు అందుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనన్నాయి. . నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ, పుణ్య కార్యాల్లోనూ పాల్గొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు
కన్యా రాశి : ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నాయి. కొంతమందికి విదేశీ ప్రయాణాలు కలిసివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అవార్డులు అందుకుంటారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఆర్జిస్తారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఆందోళనల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పెళ్లి కోసం ఎదురు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది.
తులారాశి :ఈ రాశి వారు ఈ వారం అందరికి ఆకర్షించే అవకాశం ఉంది. లో కెరీర్ లో ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం తారాస్థాయికి చేరుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు లేదా కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఎప్పడూ వాయిదా పడుతూ వచ్చిన పనులన్నీ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ధన లాభం కలుగుతుంది. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయమని పండితులు చెబుతున్నారు. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి చాలా కాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. అప్పులబాధ నుంచి బయట పడతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి.చేతి వృత్తుల వారు.. వ్యాపారస్తులు ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో మాటపట్టింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనుస్సు రాశి: రాశి వారికి ఈవారంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి ముందు మీకు అసంతృప్తి కలిగించినా.. తరువాత మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు వారం చివరిలో పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినప్పటికి.. సంతృప్తికరంగానే ఉంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ వారం మధ్యలో కాలం అత్యంత అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితలు చెబుతున్నారు. సమాజంలో గౌరవం..కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కెరీర్‌లో మీరు కోరుకున్న మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్సఫర్ అయ్యే అవకాశాలున్నాయి. కుటుంబంతో కలిసి యాత్రలు చేసే అవకాశాలున్నాయి. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారంలోగతంలో వివిధ కారణాల వలన ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు తీసుకున్న ఆలోచనలు అమలు చేస్తారు. మీ నిర్ణయాలపై కుటుంబంలో అనుకూలత. సకాలంలో రావలసిన డబ్బు సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. అనుకున్న రాబడి. ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి పొందుతారు. వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
