వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి : జీఎంపీఎస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కమిటీ

వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి : జీఎంపీఎస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కమిటీ
  • జీఎంపీఎస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌లోని మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు పేరు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యంలో, దొడ్డి కొమురయ్య పేరును పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ మేరకు జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తయి, ఆ భూమిని ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పేరుపై చర్చ జరుగుతోందని రవిందర్ తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య తొలి అమరుడిగా చరిత్రలో నిలిచారని చెప్పారు.

ఆయన త్యాగం తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం సాగిన పోరాటానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. వరంగల్ ప్రాంతానికి చెందిన చారిత్రక వ్యక్తి పేరును విమానాశ్రయానికి పెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగ పోరాట చరిత్ర, సామాజిక న్యాయ విలువలు, ప్రజా ఉద్యమాల వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేసే అవకాశం ఉంటుందని వివరించారు.