జ్యోతిష్యం: సంపద.. ఐశ్వర్యానికి శుక్రుడు కీలకం.. నెల రోజుల పాటు కన్యారాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుదంటే..!

జ్యోతిష్యం:  సంపద.. ఐశ్వర్యానికి శుక్రుడు కీలకం.. నెల రోజుల పాటు కన్యారాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుదంటే..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం...  సంపద.. ఐశ్వర్యానికి కారణమైన శుక్రుడు ఈ ఏడాది (2026) ఆగస్టు 2 వ  తేదీన  ( తెల్లవారుజామున 2.32 గంటలకు) స్థానాన్ని మార్చుకుంటాడు.   శుక్రుడు కన్యరాశిలోకి మారడం వలన  వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   అదేరాశిలో సెప్టెంబర్​ 2 వ తేదీవరకు సంచారం చేయనున్నాడు. ఇప్పుడు ఆ రాశుల వివరాలతో మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సుఖ సంతోషాలకు, సిరిసంపదలకు కారకుడిగా పరిగణిస్తారు. శుక్రుడు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు కన్యా రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. శుక్రుడికి కన్యా రాశి నీచ స్థానమే కాక, మిత్ర క్షేత్రం కూడా. శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తున్నంత కాలం కొన్ని రాశుల వారు శుక్రుడి కారకత్వాలకు అనుగుణంగా వ్యవహరించడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. 

మేషరాశి:  కన్యారాశిలో శుక్రుడు సంచరించడం వలన ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్ధికలావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టేవిషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకున్న పనులు నత్తనడకన కొనసాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవని పండితులు చెబుతున్నారు.  నిత్యం గణపతిని ప్రార్థించండి .. సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. 

వృషభరాశి:  శుక్రుడు కన్యారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.  కొత్తగా పెట్టుబడి పెట్టడం వలన అధికంగా లాభాలు వస్తాయి. శుక్రుడి శుభ ప్రభావం వల్ల జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది. సౌలభ్యం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో డబ్బు సంపాదన పెరగడం వల్ల వ్యాపారం బాగుంటుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక స్థితి మరియు కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. 

మిథునరాశి: కన్యారాశిలో  శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి  అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వ్యాపారంలో ఊహించని విజయాన్ని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆకస్మిక విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. భౌతిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారంలో మెరుగుదల, పురోగతి మార్గంలో ముందుకు సాగుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలయంలో గౌరవం కూడా లభిస్తుంది.. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడం వల్ల సంపన్నులయ్యే అవకాశం ఉంది.

కర్కాటకరాశి: శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం వలన ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి, ఏదో ఒక కారణంగా  అనవసరంగా మీ ప్రమేయం లేకుండా కలహాలు, కలతలు ఏర్పడుతాయి, ఆవేశానికి లోనుకాకండి. ఎవరితోనూగ్వాదం పెట్టుకోవద్దు. ప్రేమ భాగస్వామి నుంచి ఆశించిన సహకారం, అవగాహన లభించకపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు రెండు నెలల పాటు ఇబ్బంది పెడతాయి.  కొద్ది కాలం పాటు తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం మంచిది. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ప్రతి రోజు సూర్యాష్టకం పఠించండి. 

 సింహరాశి:  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రుడు కన్యారాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి శ్రమ ఎక్కువ .. ఫలితం తక్కువ అన్నవిధంగా ఉంటుంది. శుక్రుడు నీచబడడం వల్ల ఆర్థిక పురోగతి కాస్తంత మందగించే అవకాశం ఉంది.కొత్తకొత్త  ప్రయోగాలు చేపడతారు.  ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు.  అయితే కొంత ధనం వృధాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో సామాన్య ఫలితాలుంటాయి.  ఉద్యోగస్తులకు ఎంత కష్ట పడితే అంత ఫలితం ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు మారాలనుకునే వారు అలాంటి ప్రయత్నాన్ని వాయిదా వేసుకోండి. అనవసరంగా మీపై నింద పడే అవకాశం ఉంది.  ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. . ప్రేమ భాగస్వామికి వినూత్నమైన కానుకలతో ముంచెత్తడం కూడా జరుగుతుంది. కొత్తవారికి ప్రేమ అవకాశాలు ఏర్పడతాయి. 

కన్యారాశి:ఈ రాశి  వారికి  కన్యారాశిలో శుక్రుని సంచారం వలన ఎంతో మేలు కలుగుతుంది. ఈ సమయంలో డబ్బు సంబంధిత సమస్యలు జీవితం నుండి దూరమవుతాయి. వ్యాపారం కూడా బాగుంటుంది. ఉద్యోగం, జీతం పెరుగుదల, ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బకాయిలు తిరిగి పొందుతారు. వ్యాపారంలో గొప్ప పురోగతి ఉంటుంది. 

తులారాశి:  శుక్రుడు.. కన్యారాశిలో సంచరించడం వలన ఈ రాశి వారు ఆవేశం తగ్గించుకోండి.  దూకుడు స్వభావం కలిగి ఉండటం వలన తప్పటడుగు వేశామా అన్న ఆలోచన వస్తుంది. స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, నిజాయతీ లోపించడం వంటివి అనుభవానికి వస్తాయి.  ఓనెల పాటు ఏ విషయంలోనూ తొందరపాటు వ్యవహారాలు పనికి రావు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి.   ఉద్యోగస్తులు బాగా కష్ట పడాల్సి వస్తుంది. ఆర్ధికంగా సమయానికి డబ్బు చేతికి అందుతుంది.  

వృశ్చికరాశి:  శుక్రుడు స్థానచలనం వలన ఈరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు కార్యాలయంలో అనుకోకుండా ప్రశంసలుఅందుకుంటారు.   కేరీర్​ విషయంలో ఊహించనంత అభివృద్ది ఉంటుంది.  పూర్వీకుల ఆస్థి కలసి రావడంతో  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  నిరుద్యోగులకు గడ్​ న్యూస్​ అందుతుంది.  విదేశాలకు వెళ్లాలన్న మీ డ్రీమ్ నెరవేరుతోంది. వైవాహిక జీవితంలో ఉన్న కలతలన్నీ తొలగిపోవడంతో చాలా ఆనందంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.

ధనస్సురాశి:   శుక్రుడు ... కన్యారాశిలోకి ప్రవేశించిన తరువాత ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రేమ జీవితంలో కూడా పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. దీనితో పాటు, మీరు మీ సహోద్యోగులతో బాగా కలిసిపోతారు. సీనియర్ అధికారుల సహకారంతో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. దీంతో పాటు కెరీర్‌లో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందడం ద్వారా ఆర్థిక స్థితి బలపడుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
 
 మకరరాశి: కన్యారాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఊహించని ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొత్త గాపెట్టుబులు పెట్టేవారికి భారీగా లాభాలు వస్తాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. ఒక్కసారిగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యక్తిగత  జీవితంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మొదలు పెట్టే ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఊహించని విధంగా డబ్బు పెరిగే అవకాశాల కూడా ఉన్నాయి.

కుంభరాశి:  కన్యారాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.  అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి బాగుటుంది. ధన లాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.

మీనరాశి:   ఈ రాశి వారు శుక్రుని సంచారం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ పనులన్నింటినీ క్రమ పద్ధతిలో పూర్తి చేస్తారు. మీరు పాత పథకాల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు మెరుగైన లాభాలను పొందుతారు. వృత్తి , వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.  కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం  ఉంటుంది,  ప్రేమ యాత్రలు, విహార యాత్రలు చోటు చేసుకుంటాయి. విలువైన కానుకలు కొనిపెట్టడం జరుగు తుంది. ప్రేమ వ్యవహారాలు ఈ రెండు నెలల పాటు చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.  ప్రతి రోజు అమ్మవారిని ఎర్ర పూలతో పూజించండి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.