హైదరాబాద్, వెలుగు: రెనాకాన్ సంస్థ రెనాఫ్లెక్స్ ఫైబర్ సిమెంట్ బోర్డుల విక్రయాలను తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలో ఏడాదిలోనే రూ.350 కోట్ల పెట్టుబడితో ఈ అత్యాధునిక ప్లాంట్‌ను నిర్మించింది. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఏఏసీ బ్లాక్స్, ఫైబర్ సిమెంట్ బోర్డ్ తయారీ కేంద్రంగా ఇది నిలిచింది.
ప్రపంచస్థాయి లామినార్ ఫ్లో టెక్నాలజీతో ఈ ప్లాంట్‌లో వివిధ రకాల బోర్డులను తయారు చేస్తున్నారు. ఏడాదికి 60వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ కేంద్రం ద్వారా వెయ్యి మందికి పైగా ఉపాధి లభిస్తుంది.
ఈ బోర్డులు వేడి, తేమను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తామని రెనాకాన్ ప్రకటించింది.
