అమిత్ షాను అపరాధభావం వెంటాడుతోంది..అందుకే సభకు రావట్లేదు: రాహుల్

అమిత్ షాను అపరాధభావం  వెంటాడుతోంది..అందుకే సభకు రావట్లేదు: రాహుల్

న్యూఢిల్లీ: స్టూడెంట్స్​పై హింసకు వివరణ ఇవ్వాల్సి వస్తుందనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌‌కు రావట్లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అపరాధభావం వెంటాడుతున్నందుకే ఆయన గైర్హాజరు అవుతున్నారని  విమర్శించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియోను గురువారం ‘ఎక్స్’లో పంచుకున్న రాహుల్ గాంధీ.. ‘విద్యార్థులకు న్యాయం జరగాలి. వారిపై జరిగిన దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి’ అని పేర్కొన్నారు.