న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించిన నీట్ యూజీ 2026 మూల్యాంకన ప్రక్రియ మరోసారి వివాదంలో చిక్కుకుంది. అధికారిక ఫలితాల పోర్టల్‌లో తన స్కోరు కేవలం 24 గంటల వ్యవధిలో మూడుసార్లు మారిందంటూ ఓ అభ్యర్థి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. స్టూడెంట్ జూన్ 21న జరిగిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన తర్వాత ప్రొవిజనల్, ఫైనల్ ఆన్సర్ కీలతో సమాధానాలను సరిచూసుకున్న అభ్యర్థి, తనకు 620 మార్కులు వస్తాయని అంచనా వేశారు. కానీ, 24 గంటల్లోనే 650 అని ఒకసారి, 500 అని మరోసారి చివరకు 135 మార్కులు అని పోర్టల్‌లో చూపారని.. అలాగే ఓఎంఆర్ షీట్ కూడా తనది కాదని అభ్యర్థి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
