న్యూఢిల్లీ: పంజాబ్‌లో పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ ఢిల్లీ మండిహౌస్ సమీపంలోని ఆప్ హెడ్ క్వార్టర్స్‌ను బీజేపీ నేతలు గురువారం ముట్టడించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా నేతృత్వంలో ఫిరోజ్‌షా రోడ్డులోని ఆప్ కార్యాలయం వద్దకు చేరుకున్న నిరసనకారులు భారీ ఆందోళన చేపట్టారు. పంజాబ్‌లో ఆప్ పాలనలో ఆరు పరీక్షా పత్రాలు లీకయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన విద్యాశాఖమంత్రి హర్‌జోత్ సింగ్ బైన్స్‌తో పాటు ఇతర మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
