ఉన్మాదికి జీవిత ఖైదు ..రంగారెడ్డి జిల్లా 12వ అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

ఉన్మాదికి జీవిత ఖైదు ..రంగారెడ్డి జిల్లా 12వ అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
  • నాలుగేండ్ల కింద యువతి,ఆమె తల్లిపై కత్తితో దాడి  
  •     కన్నుమూసిన తల్లి 

 మియాపూర్, వెలుగు : ప్రేమించిన యువతి దూరం పెడుతోందని, తన నంబర్​ బ్లాక్​ చేసిందని, వేరేవాళ్లను పెండ్లి చేసుకుంటోందనే కక్షతో ఓ వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపైనా అటాక్​చేశాడు. తర్వాత గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలో తల్లి చనిపోగా హాస్పిటల్​లో చేరిన యువకుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ఎల్బీనగర్​లోని రంగారెడ్డి జిల్లా 12వ అడిషనల్​సెషన్స్​జడ్జి టి.అనిత సంచలన తీర్పు ఇచ్చారు. మరో కేసులో పదేండ్ల జైలు వేశారు. 

గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర ఇసుకపల్లికి చెందిన శోభ కూతురు వైభవి(19), ఇదే గ్రామానికే చెందిన సందీప్​(25) ప్రేమించుకున్నారు. సందీప్​కూలీ కావడంతో వైభవి పేరెంట్స్​ఒప్పుకోలేదు. దీంతో వైభవి సందీప్​ను దూరం పెట్టింది. ఫోన్​నంబర్లను బ్లాక్​ చేసింది. మాట్లాడకపోతే చస్తానని బెదిరించడంతో హైదరాబాద్​లో ఉండే తన అన్న గోవర్ధన్​వద్దకు తల్లితో కలిసి వచ్చింది. 

న్యూ హఫీజ్​పేట్​లోని ఆదిత్యనగర్​లో ఉండేవారు. వైభవికి వరుసకు మామ అయ్యే వ్యక్తితో పెండ్లి చేయాలని నిర్ణయించుకోగా, విషయం తెలుసుకున్న సందీప్​2022 డిసెంబర్​13న గోవర్ధన్​ఇంటికి వచ్చి వైభవి, శోభతో గొడవపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. తర్వాత గొంతు కోసుకున్నాడు. శోభ తీవ్ర గాయాలతో చనిపోయింది. ఈ కేసులో విచారణ తర్వాత గురువారం తీర్పు వెలువరించారు.