నల్గొండ జిల్లాలో మూసీ రిజర్వాయర్ నిండు కుండలా మారింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 638.10 అడుగులకు చేరింది.జలాశయంలోకి ఇన్‌ఫ్లో 5వేల199.43 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్‌ఫ్లో 154.24 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 2.84 టీఎంసీలుగా ఉన్నట్లు తెలిపారు అధికారులు.
రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. రిజర్వాయర్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని.. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నది పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటిస్తూ ప్రజలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు అధికారులు.
