వినాయకచవితి.. ప్రకృతి పండుగ..భక్తి ముఖ్యమే.. పర్యావరణాన్ని కలుషితం చేయొద్దు..!

వినాయకచవితి.. ప్రకృతి పండుగ..భక్తి ముఖ్యమే.. పర్యావరణాన్ని కలుషితం చేయొద్దు..!

వినాయక చవితి పండుగ ఇంటింటా భక్తి వెలుగులు నింపుతుంది. గణనాథుడి నామస్మరణతో వీధులు సందడిగా మారతాయి. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజించిన తరువాత..  ఈ పండుగ ముగిసే వేళ అదే సందడి ప్రకృతికి భారంగా మారకూడదని పండితులు.. శాస్త్రవేత్తలు చెబుతున్నారు

గణేషుడిని తొమ్మిది రోజుల పాటు పూజించిన తరువాత గణేషుడి ప్రతిమను చెరువులు. నదులల్లో నిమజ్జనం చేయడం ఆచారం.  ఆ సమయంలో  తెలిసీ తెలియక చేసే కొన్ని పనుల వలన  చెరువులు, సరస్సులు, నదుల్లో కలిస్తే కాలుష్యం పెరిగే ప్లాస్టిక్ వ్యర్థాలు. ..పర్యావరణం పై పడే ప్రభావం ప్రతి ఏటా ఆందోళన కలిగిస్తున్నాయి.

 భక్తితో చేసే పూజ.. ప్రకృతికి హాని కలిగించకుండా సాగితేనే పండుగకు అసలైన అర్థమని  చెబుతున్నారు పండితులు. అందుకే  గణపయ్యను ఆరా ధించడంతో పాటు ప్రకృతిని కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.  మట్టితో చేసిన గణపయ్యను పూజించడేకాదు..  సహజ రంగులతో వినాయకుడిని అలంకరిచండం.. పూలు, ఆకులు, కొబ్బరి ఆకులు, మామిడి తోరణాలతో మండపాన్ని అందంగా తయారు చేయాలి.  

ప్లాస్టిక్ కు దూరంగా ఉండి ఇంట్లోనే చిన్న వినాయకుడిని ప్రతిష్టించి పూజించడం  ద్వారా వ్యర్థాలను తగ్గుతాయి. ఒకవేళ అలాంటి వాడితే నిమజ్జనం సమయంలో తీసేసి పత్రి.. మట్టి విగ్రహం మాత్రమే గంగమ్మ ఒడికి చేర్చండి.  

వినాయకుడు ప్రకృతికి దగ్గరైన దేవుడు.  మన పూజతో ఆయనను సంతోషపెట్టడమే కాదు.  ఆయన సృష్టిని కూడా  కాపాడటం మన బాధ్యత.   వినాయక చవితి రోజున ఒక మాట మనం గుర్తు పెట్టుకోవాలి. "గణపయ్యకు పూజ చేయడం భక్తి అయితే  ప్రకృతిని కాపాడటం ఆ భక్తికి నిజమైన అర్థం. . .