Maha Sakthi Teaser: అమ్మోరుగా నయనతార విశ్వరూపం.. ‘మహాశక్తి’ టీజర్‌లో దుమ్మురేపిన లేడీ సూపర్‌స్టార్!

Maha Sakthi Teaser: అమ్మోరుగా నయనతార విశ్వరూపం.. ‘మహాశక్తి’ టీజర్‌లో దుమ్మురేపిన లేడీ సూపర్‌స్టార్!

లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహాశక్తి’ (Maha Sakthi). సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ వినాయకచవితి స్పెషల్గా విడుదలైంది. ఈ టీజర్‌లో నయనతార మరోసారి మూకుత్తి అమ్మన్ (అమ్మోరు తల్లి) పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. 2020లో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ (తెలుగులో 'అమ్మోరు తల్లి') సినిమాతో ఈ పాత్ర ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పాత్రతో నయనతార మరోసారి తెరపైకి రావడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

డాక్టర్ ఇషారి కె. గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవ్ని మీడియా, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్, రౌడీ పిక్చర్స్ సంస్థలతో కలిసి రూపొందిస్తున్నారు. టీజర్‌లో భారీ విజువల్స్, గ్రాండ్‌గా తెరకెక్కించిన పలు సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ గోప్యంగానే ఉంచారు. టీజర్ మొత్తం ఓ మిస్టరీతో కూడిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది.

ఇక నయనతార ఈసారి కొత్త అవతార్‌లో మూకుత్తి అమ్మన్‌గా కనిపించారు. కథలో ఆమె పాత్ర కీలకంగా ఉండబోతున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. గత సినిమాలో పరిచయమైన ప్రపంచాన్ని ‘మహాశక్తి’ మరింత విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కథలో అసలు సంఘర్షణ ఏంటి? మూకుత్తి అమ్మన్‌కు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనే విషయాలను మాత్రం టీజర్‌లో రివీల్ చేయలేదు.

ఈ చిత్రంలో నయనతారతో పాటు రెజీనా క్యాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై నయనతార-సుందర్.సి కాంబినేషన్ కారణంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘మహాశక్తి’ నవంబర్‌ 6, 2026న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. నార్త్ ఇండియాలో ఈ సినిమాను ఏఏ ఫిల్మ్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఇకపోతే, 'మూకుత్తి అమ్మన్' (Mookuthi Amman) తెలుగులో అమ్మోరు తల్లి అనేది 2020లో విడుదలైన తమిళ ఫాంటసీ-కామెడీ సినిమా. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ఆర్జే బాలాజీ మరియు ఎన్.జె. శరవణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.