సెల్‌‌‌‌ బేలో ప్రత్యేక ఆఫర్లు...

సెల్‌‌‌‌ బేలో ప్రత్యేక ఆఫర్లు...

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ సెల్‌‌‌‌బే తన పదో వార్షికోత్సవం సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది.  ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో సినీ నటి సుభశ్రీ రాయగురు, ఎండీ సోమ నాగరాజు పాల్గొని ప్రత్యేక ఆఫర్ల పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. గత పదేళ్ల ప్రయాణంలో కస్టమర్ల విశ్వాసమే తమ విజయానికి కారణమని నాగరాజు సోమ తెలిపారు. 

ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొబైల్స్ కొనుగోలు చేసే వినియోగదారులకు బ్రాండెడ్ బ్లూటూత్ స్పీకర్లు, ట్రాలీ సూట్‌‌‌‌కేసులు, కరావోకే సౌండ్ స్పీకర్లు ప్రత్యేక ధరలకు అందిస్తున్నారు. అర్హత కలిగిన కొనుగోలుదారులకు ఏడాది ఉచిత మొబైల్ బీమాతో పాటు ప్రత్యేక హ్యాండ్‌‌‌‌బ్యాగ్ దక్కించుకోవచ్చు. ఐఫోన్లపై స్పెషల్​ఆఫర్లు ఇస్తామని నాగరాజు తెలిపారు.