జియో ఐపీఓకు భారీ డిమాండ్!

జియో  ఐపీఓకు భారీ డిమాండ్!

ముంబై:  స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న దేశీయ టెలికాం, డిజిటల్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు ఇన్‌స్టిట్యూషనల్  ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ కనిపిస్తోంది.  వచ్చే వారం పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుండగా, ఇప్పటికే దాదాపు రూ.2.5 లక్షల కోట్ల విలువైన షేర్ల కోసం డిమాండ్ వ్యక్తమైనట్లు  సంబంధిత వ్యక్తులు తెలిపారు.  

ఈ ఐపీఓ కోసం ఎల్ఐసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్‌లతో పాటు బ్లాక్‌రాక్, ఫిడిలిటీ, క్యాపిటల్ గ్రూప్ వంటి ప్రముఖ గ్లోబల్ సంస్థలు ఆసక్తి చూపాయి. అలాగే సింగపూర్, నార్వే, అబుదాబి, ఖతార్ దేశాల సావరిన్ వెల్త్ ఫండ్‌లు సైతం బిడ్లు దాఖలు చేయడానికి సిద్ధమయ్యాయి.   జియో ఐపీఓ  ఈ నెల 21 న ఓపెనై, 23 న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్‌  షేరుకు రూ.1,065 నుంచి రూ.1,119.