గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్ సగం ఖతం..  8 జిల్లాల్లో 60 శాతంపైనే వాడకం

గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్  సగం ఖతం..  8 జిల్లాల్లో 60 శాతంపైనే వాడకం

 

  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మరీ దారుణం.. 102% వినియోగం
  • కుమ్రం భీం, జోగులాంబ, ములుగు బెటర్
  • ఈ 3 జిల్లాల్లో 30 శాతంలోపే.. ఆరుతడి పంటల సాగే కారణం
  • 18 బ్లాక్‌‌‌‌‌‌‌‌లలో ఓవర్​ ఎక్స్​ప్లాయిటెడ్​, 20 బ్లాక్‌‌‌‌‌‌‌‌లలో క్రిటికల్
  • ఇండియా గ్రౌండ్​ వాటర్​ రిసోర్స్​ ఎస్టిమేషన్ రిపోర్ట్

 
హైదరాబాద్​ సిటీ/మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో గ్రౌండ్​ వాటర్ ​డేంజర్​ బెల్స్​మోగిస్తున్నది. ఎల్‌‌‌‌‌‌‌‌నినో  ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌తో ఓవైపు నీటి కరువు ముంచుకొస్తుండగా, మరోవైపు విచ్చలవిడి తోడకంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఇప్పటికే సగం గ్రౌండ్​ వాటర్​ ఖతం కావడం ఆందోళన కలిగిస్తున్నది.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పరిధిలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి​ తదితర జిల్లాల్లో ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ కోసం యథేచ్ఛగా గ్రౌండ్​వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వినియోగిస్తున్నారు. పలు జిల్లాల్లో వర్షాభావం వల్ల పంటల సాగు కోసం ఇష్టారీతిగా నీటిని తోడేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో తాగునీటికి తిప్పలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండియా గ్రౌండ్​ వాటర్ ​రిసోర్స్​ఎస్టిమేషన్​(ఇంగ్రిస్​) అసెస్​మెంట్​ ఇయర్​ 2025–-26 తాజా రిపోర్ట్​  ప్రకారం.. గడిచిన రెయిన్‌‌‌‌‌‌‌‌ ఫాల్​ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు సగం ఖాళీ చేశారు. రాజధాని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 102 శాతం తోడేశారు. అంటే ఈ సీజన్​లో ఇంకిన గ్రౌండ్​ వాటర్​ కంటే 2 శాతం అదనంగా తోడేశారు. మరో 8 జిల్లాల్లో 60 నుంచి 75 శాతం వినియోగించారు.

ప్రతి ఏడాది జూన్​ నుంచి మే వరకు రెయిన్‌‌‌‌‌‌‌‌ ఫాల్​ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తారు. ఈ మేరకు సెంట్రల్​ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌బోర్డ్​ (సీజీడబ్ల్యూబీ), స్టేట్​ గ్రౌండ్ ​వాటర్ ​డిపార్ట్​మెంట్స్​ కలిసి వర్షపాతం, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ వాటర్​ అంచనాలను రూపొందిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూగర్భ జలాలను పొదుపుగా వాడుకుంటే తప్ప ఎల్‌‌‌‌‌‌‌‌నినో గండం నుంచి గట్టెక్కడం కష్టంగా కనిపిస్తున్నది. అందుకే ప్రభుత్వం యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో వరి పంట వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నది. ప్రతి ఒక్కరూ నీటి పొదుపు మంత్రం పాటించాలని కోరుతున్నది. 

వివిధ జిల్లాల్లో భూగర్భ జలాల వినియోగం ఇలా.. 

రాష్ట్రంలోనే అతి తక్కువ గ్రౌండ్​ వాటర్​ వినియోగంతో కుమ్రం భీం ఆసిఫాబాద్​, జోగులాంబ గద్వాల, ములుగు జిల్లాలు ఆదర్శంగా నిలిచాయి. ఈ 3 జిల్లాల్లో 21 నుంచి 30 శాతం లోపే వినియోగించడం విశేషం. కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌లో 22.03 శాతం, జోగులాంబ గద్వాలలో 28.29 శాతం, ములుగులో 28.81 శాతం మాత్రమే గ్రౌండ్​ వాటర్ తోడారు. ఆయా జిల్లాల్లో పత్తితోపాటు అధిక విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల నీటి వాడకం గణనీయంగా తగ్గింది. తర్వాత స్థానాల్లో వరుసగా భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నాగర్​కర్నూల్ జిల్లాలు నిలిచాయి. ఈ 6 జిల్లాల్లో 31 నుంచి 40 శాతం లోపు గ్రౌండ్​ వాటర్​వినియోగించారు.

ఇక 41 నుంచి 50 శాతంలోపు భూగర్భ జలాలు తోడిన వాటిలో సూర్యాపేట, ఖమ్మం, నారాయణపేట, వనపర్తి, జయశంకర్​ భూపాలపల్లి, జగిత్యాల, సంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. నిజామాబాద్, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో 51 నుంచి 60 శాతం వినియోగించగా, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, మెదక్​, సిరిసిల్ల, సిద్దిపేట, మేడ్చల్, మహబూబ్​నగర్​ జిల్లాల్లో యథేచ్ఛగా తోడేసినట్టు ఇంగ్రిస్​ రిపోర్టు వెల్లడించింది. ఈ 8 జిల్లాల్లో ఏకంగా 61 నుంచి 74 శాతం గ్రౌండ్​ వాటర్​ వినియోగించారు. హైదరాబాద్​ జిల్లాలో అత్యధికంగా 102 శాతం భూగర్భ జలాలను తోడేశారు. 

ఏయే జిల్లాలు ఏయే లిస్టులో ఉన్నాయంటే.. 

గత రెయిన్​ఫాల్​ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్న గ్రౌండ్​ వాటర్​ కంటే ఎక్కువగా తోడిన ప్రాంతాలను ఓవర్​ ఎక్స్​ప్లాయిటెడ్​బ్లాక్‌‌‌‌‌‌‌‌లుగా గుర్తించారు. ఇందులో ఆదిలాబాద్​ అర్బన్​, నిజామాబాద్​ సౌత్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బాచుపల్లి, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, బాలానగర్, అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట, ఖైరతాబాద్​, మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి, సికింద్రాబాద్, హిమాయత్​నగర్, గోల్కొండ, ఆసిఫ్​నగర్, నాంపల్లి, అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్, చార్మినార్, సైదాబాద్‌‌‌‌‌‌‌‌తోపాటు నల్గొండ జిల్లా మునుగోడు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బ్లాక్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. క్రిటికల్​ కేటగిరీలో బాలానగర్​, శేరిలింగంపల్లి, మారేడ్​పల్లి, ముషీరాబాద్, సరూర్​నగర్, హయత్​నగర్, కుత్బుల్లాపూర్, షేక్‌‌‌‌‌‌‌‌పేట, బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుర, బండ్లగూడ, బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు భీమదేవరపల్లి, రాజపేట, మూడుచింతలపల్లి, మూటకొండూర్, ఆత్మకూర్​(ఎం), చిట్యాల, నారాయణపూర్, చౌదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడెం, మిడ్జల్​బ్లాక్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గల మొత్తం 81 మండలాలను భూగర్భ జలాల లభ్యత దృష్ట్యా ‘సెమీ క్రిటికల్ బ్లాకులు’గా నివేదిక గుర్తించింది.ఈ జాబితాలో ఉమ్మడి మెదక్, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి పలు జిల్లాలకు చెందిన కీలక ప్రాంతాలు ఉన్నాయి. ఈ మండలాల్లో భూగర్భ జలాల వినియోగం పరిమితికి చేరువవుతుండటంతో నీటి లభ్యతపై ఒత్తిడి పెరుగుతున్నట్టు స్పష్టమవుతున్నది. భవిష్యత్తులో తీవ్ర నీటి కొరత ఏర్పడకుండా నివారించేందుకు ఈ ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు అత్యవసరమని నివేదిక హెచ్చరిస్తున్నది.

రోజూ కొత్తగా 200 కొత్త  బోర్లు..

హైదరాబాద్ నగర పరిధిలో భూగర్భజలాలు అడుగంటుతుండటంతో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా బోర్లు తవ్వుతున్నారు. వర్షాలు లేకపోవడం, పాత బోర్లు ఎండిపోతుండటం, కొత్త నిర్మాణాల పెరుగుదల కారణంగా నగరంలో రోజుకు సగటున 200 కొత్త బోర్లు వేస్తున్నట్టు అధికారుల అంచనా. ‘వాల్టా’ చట్టం ప్రకారం నగరంలో 400 అడుగుల వరకే తవ్వకాలకు అనుమతి ఉన్నప్పటికీ, కొండాపూర్, బంజారాహిల్స్, బండ్లగూడ జాగీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ఏకంగా వెయ్యి నుంచి 2వేల అడుగుల లోతు వరకు తవ్వి భారీ మోటార్లు దింపుతున్నారు. చాలా ప్రాంతాల్లో సరైన అనుమతులు లేకుండానే ఈ పనులు సాగుతున్నాయి. ఇటీవల బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌తోపాటు బండ్లగూడ జాగీర్, కొండాపూర్  ప్రాంతాల్లో 2 వేలకి పైగా అడుగుల లోతులో బోర్లు వేసి, 10 హెచ్‌‌‌‌‌‌‌‌పీ మోటార్లను దింపుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.  

క్యూర్‌‌‌‌‌‌‌‌ పరిధిలో  దాదాపు 15 లక్షలకు పైగా బోర్లు ఉన్నట్లు అంచనా. అధికారుల అంచనా ప్రకారం గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో నిత్యం సుమారు 100 వరకు బోర్లు ఎండిపోతున్నాయి. వీటి స్థానంలో కొత్త బోర్లు వేయడంతోపాటు కొత్త నిర్మాణాల వల్ల సగటున మరో వంద బోర్లు కలిపి 200 బోర్ల దాకా వేస్తున్నారు. మరోవైపు భూగర్భజలాల సంరక్షణకు కీలకమైన ఇంకుడుగుంతల నిర్మాణంపై ప్రజలు, అధికారులు దృష్టి సారించకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. చట్ట ప్రకారం కలెక్టర్, తహసీల్దార్, భూగర్భజల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు, జరిమానాలు విధించాల్సి ఉన్నా ఆ దిశగా సరైన చర్యలు కనిపించడం లేదు. పర్యవేక్షణ లోపం, కొందరు అధికారుల అవినీతి ఆరోపణల కారణంగా వాల్టా చట్టం కాగితాలకే పరిమితమై, నగరంలో నీటి సంక్షోభం రోజురోజుకూ పెరుగుతోంది. 

 2025-26 అసెస్​మెంట్​ ఇయర్​ రిపోర్ట్​ ప్రకారం 
తెలంగాణలో వర్షపాతం : 917.35 మిల్లీమీటర్లు
రీచార్జ్​ అయిన గ్రౌండ్​ వాటర్​:23,63,539.37 (హ్యామ్​)
నేచురల్​ డిశ్చార్జ్​: 2,26,208.48 (హ్యామ్​) 
అందుబాటులో ఉన్న గ్రౌండ్​ వాటర్​: 21,37,331.67 (హ్యామ్​)
ఏడాదిలో తోడిన గ్రౌండ్​ వాటర్​ 995896.14 (హ్యామ్​) 
ఒక హెక్టార్ వైశాల్యం గల భూమిపై ఒక మీటర్ లోతు వరకు నిలిచిన నీటి ఘన పరిమాణాన్ని ఒక హెక్టార్-మీటర్ (హ్యామ్‌‌‌‌‌‌‌‌) అంటారు 

హైదరాబాద్ జిల్లాలో అట్టడుగుకు గ్రౌండ్ వాటర్..

నిరుడు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో భూగర్భ జలాలు  సగటున 6.46 మీటర్ల మేర లోతుకు పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో జిల్లా సగటు నీటిమట్టాలు 3.55 మీటర్లు ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 10.01 మీటర్లకు చేరాయి.  నేచర్‌‌‌‌‌‌‌‌క్యూర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌వద్ద గతేడాది 1.16 మీటర్లు ఉన్న గ్రౌండ్ వాటర్ ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  34.99 మీటర్లకు పడిపోయింది.  మారేడ్‌‌‌‌‌‌‌‌పల్లిలోని ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌వద్ద గతేడాది 3.10 మీటర్లు ఉండగా..  ఈ ఏడాది 17.83 మీటర్లకు,  ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ప్రాంతంలో గతేడాది  2.04 మీటర్లు ఉండగా,  ఈ సారి 11.27 మీటర్లకు పడిపోవడం గమనార్హం.  ప్రాంతాలవారీగా చూస్తే  గోల్కొండలో గతేడాది 5.78 మీటర్లలో ఉంటే  ప్రస్తుతం 24.65 మీటర్లకు,  చాంద్రాయణగుట్టలో 10 మీటర్ల నుంచి 18.20 మీటర్లకు, ఉప్పుగూడలో 4.46 నుంచి 12.24 మీటర్లకు చేరాయి.  రంగారెడ్డి జిల్లాలో గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 6.31 మీటర్ల లోతులో ఉండగా.. ఈ ఏడాది 11.74 మీటర్లకు పడిపోయింది. అంటే ఏడాది వ్యవధిలో 5.43 మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది.  ఇక మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  సగటున 6.30మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం.