హైదరాబాద్, వెలుగు: టాటా స్టార్‌బక్స్ దక్షిణాదిలో తొలి స్టార్‌బక్స్ రిజర్వ్ స్టోర్‌ను గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీంతో దేశంలో మొత్తం రిజర్వ్ స్టోర్ల సంఖ్య ఆరుకు చేరింది.
సాధారణ స్టోర్లలో దొరికే కాఫీ కాకుండా, ప్రపంచంలోని అత్యుత్తమ నాణ్యత గల ప్రత్యేకమైన సింగిల్ -ఆరిజిన్ కాఫీ గింజలను ఇక్కడ అందిస్తారు.
ఈ స్టోర్ల డిజైన్, ఇంటీరియర్స్ అత్యున్నతంగా, కళాత్మకంగా ఉంటాయని సీఈఓ సురేశ్ చెప్పారు. 80 భారతీయ నగరాలలో 500లకు పైగా స్టోర్లను నిర్వహిస్తున్నామన్నారు.
