హైదరాబాద్ లో ఎకో సస్టెయిన్ ఎక్స్‌‌‌‌పో షురూ..

హైదరాబాద్ లో ఎకో సస్టెయిన్ ఎక్స్‌‌‌‌పో షురూ..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి సాధించే లక్ష్యంతో హైదరాబాద్​లో ఎకో సస్టెయిన్ ఎక్స్‌‌‌‌పో కాన్ఫరెన్స్ ప్రారంభమయింది. ఈ ప్రదర్శన ఆగస్టు ఒకటి వరకు కొనసాగుతుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ మధుకర్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

దాదాపు 140 సంస్థలు వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి, బయో ఎనర్జీ వంటి ఆధునిక టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 30 నగరాల నుంచి 12 వేల మంది వ్యాపార ప్రతినిధులు, సందర్శకులు ఈ ప్రదర్శనకు హాజరవుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు పారిశ్రామిక రంగాన్ని అనుసంధానించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.