గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల జిమ్లో వర్కవుట్చేస్తుండగా కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు ముక్కుకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో హిమాన్షుకు భవిష్యత్తులో శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు గచ్చిబౌలి ఏఐజీ దవాఖాన డాక్టర్లు సర్జరీ చేశారు. విషయం తెలుసుకున్న మాజీ సీఎం, హిమాన్షు తాత కేసీఆర్గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లి తన మనవడిని పరామర్శించారు.
