Rahane Retirement: భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించడంతో క్రీడా ప్రపంచం మొత్తం ఎమోషనల్ అయింది. సుదీర్ఘ కాలం పాటు టీమిండియాకు అందించిన విశేష సేవలను స్మరించుకుంటూ మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు ఆయనకు అండగా నిలిచారు. సచిన్ టెండూల్కర్ మొదలుకొని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, జస్ప్రీత్ బుమ్రా, ఛతేశ్వర్ పుజారా, మహమ్మద్ షమీ వరకు పలువురు రహానేపై ప్రసంశలు కురిపించారు.
జట్టు కోసం కష్టపడే తత్వం నీది: సచిన్
ముంబై రంజీ జట్టుతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రహానేతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రహానేతో తొలిసారి ఓపెనింగ్ బ్యాటింగ్ చేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన కెరీర్ పూర్తి చేసుకున్న అజింక్యా రహానేకు అభినందనలు.. ముంబై తరఫున నీతో కలిసి మొదటిసారి బ్యాటింగ్ చేసినప్పుడే నీలోని ప్రత్యేకతను గమనించాను.. నువ్వు ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్ల వెనుక పరిగెత్తలేదు.. జట్టు కోసం కష్టపడటానికి సిద్ధంగా ఉండటంతో ఆ క్షణాలే నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి.. 2013లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టెస్టు అరంగేట్రం చేసినప్పుడు కూడా నీ ప్రశాంతత, అంకితభావం నన్ను ఆకట్టుకున్నాయని సచిన్ ఎక్స్ (Twitter) వేదికగా రాసుకొచ్చాడు.
Congratulations on a remarkable career, @ajinkyarahane88.
— Sachin Tendulkar (@sachin_rt) July 30, 2026
The first time we batted together for Mumbai, I saw someone who never chased moments. They came to you because you were willing to do the hard yards for the team. That same quality defined your finest hour in Australia.…
అద్భుతమైన భాగస్వామ్యాలు మరువలేనివి: ఛతేశ్వర్ పుజారా
విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలతో కలిసి భారత మిడిలార్డర్‌లో పటిష్టమైన భాగస్వామ్యాలు నెలకొల్పిన మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా రహానేకు అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రహానేతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, మైదానం లోపల, వెలుపల మన ఇద్దరి మధ్య స్నేహం, గుర్తుండిపోయే భాగస్వామ్యాలను ఎప్పటికీ తీపి గుర్తుగా దాచుకుంటానని పుజారా పేర్కొన్నారు.
Congratulations on a career you can be incredibly proud of, Ajinkya!
— Cheteshwar Pujara (@cheteshwar1) July 30, 2026
It has been an honour sharing the dressing room with you over the years; and building partnerships and memories on and off the field that will always fondly remember.
Wishing you and the family the absolute… pic.twitter.com/dnRcOta2es
నా కోచింగ్ కెరీర్‌లో కీలక ఆటగాడు: రవిశాస్త్రి
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రహానేను తన కోచింగ్ కాలంలో అత్యంత కీలకమైన ప్లేయర్‌గా అభివర్ణించారు. 2020–21లో ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టు ఘోర పరాభవం తర్వాత విరాట్ కోహ్లీ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రహానే, గాయాలపాలైన భారత జట్టును నడిపించి చారిత్రాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుని తనలోని నాయకత్వాన్ని రుజువు చేశాడని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నారు.
►ALSO READ | కామన్వెల్త్ క్లోజింగ్ సెర్మనీలో భారత్ స్పెషల్ షో.. శంకర్ మహదేవన్, మానుషి చిల్లర్ సందడి!
One of India's most committed cricketers who was an integral part of my tenure as coach and gave yeoman service to Mumbai and Indian cricket. Well done Jinks. @ajinkyarahane88 pic.twitter.com/I4bG7qtXHH
— Ravi Shastri (@RaviShastriOfc) July 30, 2026
అండర్‌రేటెడ్ క్రికెటర్: బుమ్రా, షమీ, సెహ్వాగ్, ధావన్ ప్రశంసలు
* టీమిండియా బౌలింగ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ.. రహానేతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, చిరస్మరణీయ విజయాల్లో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు.
* మహమ్మద్ షమీ: భారత జెర్సీలో నువ్వు సాధించిన ప్రతీ పరుగు, పోరాడిన ప్రతీ మ్యాచ్, అందించిన ప్రతి జ్ఞాపకానికి ధన్యవాదాలు అంటూ రహానే క్లాస్, క్రమశిక్షణ, అంకితభావాన్ని షమీ కొనియాడారు.
* వీరేంద్ర సెహ్వాగ్: రహానేను భారత క్రికెట్‌లో అత్యంత అండర్‌రేటెడ్ (Underrated) క్రికెటర్లలో ఒకడు అని వీరు అభివర్ణించారు.
* శిఖర్ ధావన్: ఇన్‌స్టాగ్రామ్‌లో రహానేతో ఉన్న కొన్ని అరుదైన, ఆఫ్ ది ఫీల్డ్ ఫోటోలను షేర్ చేసిన ధావన్ అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
One of the most underrated cricketers, and the man who led India to its greatest ever overseas Test series win @ajinkyarahane88.
— Virrender Sehwag (@virendersehwag) July 30, 2026
Calm, Solid. Kabhi shor nahi kiya, aur apna best karta raha.
Just like against SA in Delhi ,2015 after a wonderful first innings, may you have a great…
