సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాల్లో తగ్గిన ఆర్థిక నష్టం..గతేడాది 9 నెలల్లో రూ.1,104.42 కోట్లు లాస్

సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాల్లో తగ్గిన ఆర్థిక నష్టం..గతేడాది 9 నెలల్లో రూ.1,104.42 కోట్లు లాస్
  •     ఈ ఏడాది రూ.881.72 కోట్లకు తగ్గిన నష్టం

హైదరాబాద్, వెలుగు: ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్‌‌‌‌‌‌‌‌ మోసాల్లో ఆర్థిక నష్టం తగ్గుముఖం పట్టింది. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి 9 నెలల్లో బాధితులు కోల్పోయిన సొమ్ము రూ.1,104 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.881.72 కోట్లకు పరిమితమైంది. ఈ మేరకు రూ.222.70 కోట్లుగా 20.2 శాతం ఆర్థిక నష్టం తగ్గింది. మరోవైపు సైబర్‌‌‌‌‌‌‌‌ మోసగాళ్ల బ్యాంకు ఖాతాల్లో నిలిపివేసిన నగదు మొత్తం 42.2 శాతం పెరిగింది. 2025 జనవరి, -సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ లో రూ.183.11 కోట్లు సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల ఖాతాల్లో నిలిపివేయగా.. 2026లో అదే కాలానికి రూ.260.30 కోట్లు అంటే అదనంగా రూ.77.19 కోట్లను మోసగాళ్ల ఖాతాల్లో నిలిపివేయగలిగారు. ఈ మేరకు తెలంగాణ సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌‌‌‌‌బీ) డైరెక్టర్ శిఖాగోయల్ ఆదివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 

సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్ములో రూ.222.70 కోట్ల మేర సైబర్‌‌‌‌‌‌‌‌ మోసగాళ్ల బ్యాంకు ఖాతాల్లో వెళ్లకుండా నిలిపివేసిన నగదు మొత్తం 42.2 శాతానికి పెరిగిందని శిఖాగోయల్ తెలిపారు. కాగా, సైబర్ నేరాల నివారణ కోసం అక్టోబర్‌‌‌‌‌‌‌‌ ఒకటి నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా టీజీ సీఎస్‌‌‌‌‌‌‌‌బీ ఆధ్వర్యంలో సైబర్‌‌‌‌‌‌‌‌ భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, సామాజిక సమావేశాల్లో కలిపి 4,248 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. సైబర్‌‌‌‌‌‌‌‌ మోసాలకు గురైన వెంటనే బాధితులు ఫిర్యాదు చేయడం, సత్వర ఆర్థిక లావాదేవీల నిలుపుదల చర్యలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఆమె పేర్కొన్నారు. పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లు, ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.