3 వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టిన షాల్క్విక్: 6 ఓవర్లలోనే అభి, ఇషాన్, తిలక్, దూబే ఔట్

3 వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టిన షాల్క్విక్: 6 ఓవర్లలోనే అభి, ఇషాన్, తిలక్, దూబే ఔట్

టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా అమెరికా, టీమిండియా జట్లు తలపడుతున్నాయి. శనివారం (ఫిబ్రవరి 7) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో అమెరికా బౌలర్లు టీమిండియాకు ఝలక్ ఇచ్చారు. భీకర ఫామ్‎లో ఉన్న భారత ప్లేయర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‎, తిలక్ వర్మ, శివమ్ దూబేను ఔట్ చేసి షాక్ ఇచ్చారు. 

పవర్ ప్లే ముగిసే వరకు నాలుగు కీలక వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు. అభిషేక్ శర్మ డకౌటై తీవ్ర నిరాశపర్చగా.. ఇషాన్ కిషన్ 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 25 రన్స్ చేసి మంచి టచ్‎లో ఉన్న తిలక్ వర్మను వాన్ షాల్క్విక్ పెవిలియన్ పంపాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 

ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే మూడు కీలక వికెట్లు తీసి వాన్ షాల్క్విక్ టీమిండియాను దెబ్బకొట్టాడు. అలీఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 55 రన్స్ చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (3), రింకు (1) క్రీజులో ఉన్నారు. పసికూనే కదా అని అమెరికాను లైట్ తీసుకోవడంతో భారత ఆరంభంలోనే తగిన మూల్యం చెల్లించుకుంది.