సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత్?.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బిగ్ బూస్ట్

సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత్?.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బిగ్ బూస్ట్

India vs Bangladesh: భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 2026లో టీమిండియా బంగ్లాలో పర్యటించే ఛాన్స్ ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటనలో భాగంగా ఇండియా 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ ఖరారైతే, కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టేందుకు మార్గం సుగమం కానుంది.  

బీసీసీఐతో చర్చలు.. తమీమ్ ఇక్బాల్ ఏమన్నారంటే: 
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్‌పై నిన్న ( బుధవారం, జులై 29న) విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీసీబీ చీఫ్ తమీమ్ ఇక్బాల్ .. బీసీసీఐతో (BCCI) తమ బోర్డు అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పుకొచ్చాడు. ఇండియా సిరీస్‌కు సంబంధించి ప్రస్తుతం నా వద్ద అధికారిక సమాచారం ఏం లేదు.. కానీ ఈ సిరీస్ సాధ్యమయ్యేలా మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లంటే క్రికెటర్లు, ఫ్యాన్స్, మీడియాలో ఉండే ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుందని తమీమ్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ పర్యటన 2025 ఆగస్టులోనే జరగాల్సి ఉండగా, ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందంతో దీనిని సెప్టెంబర్ 2026కి వాయిదా వేశారు.

►ALSO READ | మెకల్లమ్ ఔట్.. ఫ్లెమింగ్ ఇన్.. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కోచ్గా స్టీఫెన్

బంగ్లాదేశ్ ఎంతో సురక్షితమైన దేశం: 
బంగ్లాదేశ్‌లో భద్రతాపై వస్తున్న పుకార్లను బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ కొట్టిపారేశారు. బంగ్లాదేశ్ ఎంతో సురక్షితమైన దేశం.. టీమిండియా ఇక్కడికి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.. మా వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని రకాల భద్రతా చర్యలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. బోర్డు అధ్యక్షుడిగా తన పరిధిలోని అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని, అయితే తుది నిర్ణయం అనేది కేవలం బీసీసీఐ చేతిలో మాత్రమే ఉందన్నాడు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తమీమ్ వెల్లడించాడు. 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బిగ్ బూస్ట్: 
ఈ పర్యటన ఒకవేళ ఖరారైతే భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వన్డే మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగమైన రోహిత్ శర్మకు ఈ వన్డే సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో లార్డ్స్ మైదానంలో సెంచరీ కొట్టిన హిట్ మ్యాన్, తన రిటైర్మెంట్ ప్రచారాలకు బ్రేక్ వేశాడు. 39 ఏళ్ల వయసులో కెరీర్ చివరి వన్డే ప్రపంచకప్‌లో ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ శర్మకు ఈ బంగ్లాదేశ్ సిరీస్ మంచి పునాదిగా మారనుంది.