హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఇండియా కౌచర్ వీక్ 2026 వేడుకల్లో తనదైన గ్లామర్, డ్రెస్సింగ్ స్టైల్లో అందరి దృష్టిని ఆకట్టుకు న్నారు. ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన 'దేవి' కలెక్షన్కు ఆమె షోస్టాపర్ గా వ్యవహరించారు. షాంపైన్ కలర్ కాంబినేషన్లో హెవీ ఎంబ్రాయి డరీ, సీక్విన్ వర్క్ కూడిన ట్రెండీ లెహంగా డిజైన్ కౌచర్ డ్రెస్లో ఆమె ర్యాంప్ వాక్ చేశారు. రాయల్ లుక్ లో కాన్ఫిడెంట్ ర్యాంప్
వాక్, క్లాసిక్ ఫీచర్స్తో ఇండియా కౌచర్ వీక్ లో ఆకర్షణీయమైన షోస్టాపర్లలో ఒకరిగా ఆమె నిలిచారు. ఇక ప్రస్తుతం తమిళంలో పా రంజిత్ తెరకెక్కిస్తున్న 'వెట్టువమ్' అనే చిత్రంలో శోభిత హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆమె ఛాలెంజింగ్ రోల్ ప్లే చేస్తోంది.
ఇదికాక జయం రవికి జంటగా 'వైట్' అనే థ్రిల్లర్ మూవీలోనూ ఆమె నటిస్తున్నట్టు సమాచారం. అట్లీ శిష్యుడు శ్యామ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 'పొన్నియన్ సెల్వన్' తర్వాత జయం రవి, శోభిత కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
