ప్రతి ఒక్కరు జీవితంలో ఎదగాలని.. ఉన్నత స్థితిని చేరుకోవాలని..అందరితో గౌరవించబడాలని.. కోరుకుంటారు. కనీసం వారు పనిచేసే రంగంలోనైనా ఉన్నత స్థితిని చేరాలనుకుంటారు.. లైఫ్ లో ఎదగాలనుకొనే వారు తెలుసుకోవలసిన విషయాలను ఈస్టోరీలో చూద్దాం. . .
ఒంటరి తనమే జీవితంలో ఎదిగేందుకు అసలైన టెస్ట్. ఈ టెస్ట్ లో పాస్ అయితేనే నువ్వు సక్సెస్ కి అర్హుడివి. నువ్వు ఒంటరిగా కూర్చుని నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకుంటే, నీ మెదడు స్టీల్ లా మారుతుంది. నీ గుండె ఒక రాయిలా తయారవుతుంది. నీ లక్ష్యం నీకు క్లియర్‌గా కనిపిస్తుంది.
ప్రతి మనిషికి ఏదో రంగంలో నైపుణ్యత ఉంటుంది. దానిని గుర్తించి.. సద్వినియోగపర్చుకున్నవారు జీవితంలో ఉన్నతస్థితిని చేరుకుంటారు. ప్రతి మనిషి ఎదుగుదలకు ఒక ధర ఉంది. ఆ ధర డబ్బు కాదు.. కీర్తి కాదు, నీ ఎనర్జీ మాత్రమే కాదు. ఆ ధర పేరు ఒంటరితనం. ఈ మాట వినగానే షాక్ అయ్యారా... సక్సెస్ వస్తే చుట్టూ వంద మంది ఉంటారు.. అందరూ చప్పట్లు కొడతారు అని కలలు కంటున్నావా? ఆ ఆలోచన వినడానికి చాలా క్యూట్‌గా ఉంటుంది కానీ, అది పచ్చి అబద్ధం. నిజంగా ఎదిగేవాడు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. ఎందుకంటే, ఒంటరిగా ఎదిగినవాడు మాత్రమే టీమ్ లీడర్ గా వ్యవహరించగలడు.
నీవు ఎదగడం మొదలుపెట్టగానే నీ చుట్టూ ఉన్న జనం పలచబడతారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించావా... ఎందుకంటే నువ్వు మారిపోతావు. నీ మాటలు మారుతాయి, నీ ఆలోచనా విధానం మారుతుంది. నీ టైమ్ విలువ నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ పాత ఫ్రెండ్స్‌కి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు నచ్చవు. అందుకే అందరూ నీకు దూరంగా ఉంటారు. వాళ్లను వదిలేసి మీ లక్ష్యంపై దృష్టి పెట్టిన వారు జీవితంలో సక్సెస్ అవుతారు.
నీ ప్రయారిటీస్ మారినప్పుడు వాళ్ళు ఎందుకు నీతో ఉండాలని మీకు మీరే ప్రశ్నించుకోవాలి.. మన వర్క్ లో మనం బిజీగా ఉంటే... టైమ్ పాస్ చేసే వాళ్ళకి.. ముచ్చట్లు చెప్పి కాలక్షేపం చేసేవారికి ఆటోమేటిక్ గా మీరు శత్రువులు అవుతారు.ఈ విషయాన్ని గుర్తించి అలాంటి వారితో హాయ్ అంటే హాయ్ .. బై.. అంటే బై గా ఉండండి.. వారి మాటలను అస్సలకు పట్టించుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
నువ్వు ప్రతి విషయంలో అప్డేట్ అవుతుంటే, పాత పద్ధతుల్లోనే ఉన్న వాళ్ళకి నువ్వు ఒక అహంకారిలా కనిపిస్తావు .. వారు చెప్పేది వినకుండా నీపని నీవు చేసుకుంటావు. అప్పుడు మీ స్నేహితులు నువ్వు మారిపోయావు అంటూ అందరూ నిన్ను అవమాన పరుస్తుంటారు.
కాని నువ్వు మారకపోతే నీ లైఫ్ ఎలా మారుతుంది? అనే విషయాన్ని గుర్తించాలి. నువ్వు గతంలో మాదిరిగా ఉంటేనే వాళ్ళకి కంఫర్ట్. నువ్వు ప్రతి విషయాన్ని ప్రస్తుత జనరేషన్.. టెక్నాలజీ ఆధారంగా పూర్తిగా తెలుసుకొంటే వాళ్ళ ఈగోకి అది ఒక పెద్ద దెబ్బగా మారుతుంది. అలాంటప్పుడు . నీ ఎదుగుదల వాళ్ళ అసమర్థతను గుర్తు చేస్తుంది. అందుకే వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. దానికి నువ్వు బాధపడకుండా సెలబ్రేట్ చేసుకోవాలి.
నీ క్రమశిక్షణ స్ట్రాంగ్‌గా ఉంటే, బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు నిన్ను అసహ్యించుకుంటారు. ఎందుకంటే.. నీ డిసిప్లిన్ వాళ్ళకి ఒక అద్దం లాంటిది. అందులో వాళ్ళ బద్ధకం, వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తాయి. నీ రొటీన్ వాళ్ళ సోమరితనానికి రిమైండర్ అయిపోతుంది .
నీ ఫోకస్.. నీవు చేస్తున్న వర్క్ మీద ఉంటుంది. రాత్రింబవళ్ళు కూర్చుని వర్క్ చేస్తుంటే... వాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది? మీరు కొత్త స్కిల్ నేర్చుకుంటుంటే.. వాళ్ళకు అన్ ఈజీగా ఉంటుంది కదా.. మీరు వాళ్లను కాదని ఏదో చేస్తుంటారు.. కొన్ని విషయాలను నేర్చుకుంటున్నారు కదా..! వాళ్లు అప్ డేట్కావడం లేదనుకోరు.. ఇలాంటి పరిస్థితిలో వారికేం చేయాలో తెలియక నిన్ను చూసి నవ్వుతారు. నీ ప్లాన్స్‌ని చిన్నవి చేసి చూపిస్తారు. నువ్వు చేసే ప్రయత్నానికి .. ఓవర్.. అని ముద్ర వేస్తారు.నీ వల్ల వాళ్ళలో కలిగే గిల్ట్ ని ఆపాలని చూస్తున్నారు. నువ్వు ఆగిపోతే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. అవసరమైతే అలాంటి వారికి వదిలేయాలి కాని.. వాళ్ల కోసం నీ గోల్‌ను వదులుకోకూడదు.
నీవు మాత్రమే కష్టపడుతున్నావు.. అలాంటప్పుడు ఫలితం కూడా నీకు మాత్రమే వస్తుంది. కాని అలా నీ ఒక్కడికే వస్తే మిగతా వారికి ఈర్ష.. అసూయ..ద్వేషం పెరుగుతాయి కదా..! నిన్ను నువ్వే ముందుకు నెట్టుకోవాలి. నిన్ను నువ్వే లేపుకోవాలి. అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని "నువ్వు చేయగలవు" అని చెప్పుకోవాలి. అదే అసలైన గేమ్. ఈ ఒంటరి పోరాటమే నిన్ను స్ట్రాంగ్‌గా మారుస్తుంది.
ఒంటరితనం అంటే డిప్రెషన్ కాదు, అది డెవలప్‌మెంట్. డిప్రెషన్ అంటే నువ్వు లొంగిపోవడం, ఒంటరితనం అంటే నువ్వు తయారవ్వడం. నీ లోపల వినిపించే నెగటివ్ మాటలకి సమాధానం.
Lonely seasons build powerful humans ఇది కేవలం ఒక డైలాగ్ కాదు, ఇదొక రూల్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నిజంగా నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది. ఎవరూ చూడనప్పుడు కూడా నువ్వు సిన్సియర్‌గా పని చేసి కొత్త విషయాలు నేర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు.
