మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు డైరెక్టర్. సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ నాగ వంశీ ఈ సినిమా ప్రొడ్యూసర్. ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ బ్యూటీ కాయాదు లోహర్ హీరోయిన్. మహాశివరాత్రి సెలవులను టార్గెట్ చేసుకుని ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ఈ ‘ఫంకీ’ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది.
అనుదీప్ కేవీ మార్క్ కామెడీ, వన్ లైనర్లతో ట్రైలర్ ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇందులో పెద్దగా ఎమోషనల్ సీక్వెన్స్లు ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లకు రావొద్దని సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ అని నిర్మాత నాగ వంశీ చెప్పేశాడు. ట్రైలర్ చూశాక ప్రేక్షకులకు కూడా సేమ్ ఫీలింగ్ కలిగింది. ‘ఫంకీ’ సినిమాలో విశ్వక్ సేన్ సినిమా డైరెక్టర్ రోల్ చేస్తున్నాడు. ఈ ‘ఫంకీ’ కామెడీ వర్కౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ట్రైలర్లో ఉన్నంత ఫన్ సినిమాలో ఉంటే Gen-Zs థియేటర్లకు గట్టిగానే వెళ్లే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా Funky సినిమా ట్రైలర్ బాగుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 2025 సంవత్సరం నిర్మాత నాగవంశీకి పెద్దగా కలిసిరాకపోయినా 2026 మాత్రం హిట్తో మొదలైంది. సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా హిట్ కావడంతో ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా సాగే సినిమాలు తనకు కాసులు కురిపిస్తాయని నాగ వంశీ బలంగా నమ్ముతున్నాడు. ‘ఫంకీ’ కూడా ఆ జానర్ కావడం వల్ల ఈ సినిమాపై కూడా నాగవంశీ కాన్ఫిడెంట్గా ఉన్నాడు.
ఇక.. విశ్వక్ సేన్ హీరోగా సినిమా మొదలై.. ఆ తర్వాత దర్శకుడికి, అతనికి మధ్య విభేదాలు రావడంతో అతను తప్పుకున్న సినిమా ‘సీతా పయనం’. యాక్షన్ కింగ్ ‘అర్జున్ సర్జా’ ఈ సినిమాకు దర్శకుడు. దర్శకుడిగా ఆయనకు ఇది రెండో సినిమా. అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య ఈ సినిమా హీరోయిన్. నిరంజన్ అనే యువ నటుడు హీరో. సింపుల్ ట్రావెల్ జర్నీ ఈ సినిమా స్టోరీ లైన్. కోర్ పాయింట్.. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్. ఈ సినిమా ట్రైలర్ కూడా విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్ విడుదలైన శనివారమే విడుదలైంది. ట్రైలర్ చాలా క్లాసిక్గా అనిపించింది.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ అవుతుందనిపిస్తుంది. బంధాలు, అనుబంధాల విలువను హృద్యంగా చూపించేందుకు దర్శకుడిగా మారి అర్జున్ చేసిన ప్రయత్నమే ఈ ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ఈ ‘సీతా పయనం’ సినిమా విడుదల కానుంది. ‘ఫంకీ’, ‘సీతా పయనం’.. ఈ రెండు సినిమాల ట్రైలర్లను పోల్చి చూస్తే రెండూ బాగానే అనిపించాయి. ఎంటర్టైన్మెంట్ సినిమా, ఎమోషనల్ సినిమా పోటీ పడితే ఏమవుతుందో ఫిబ్రవరి 14న తేలిపోనుంది.
