హైదరాబాద్ పాతబస్తీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తయింది.ఆషాఢ మాస బోనాల పండుగ అత్యంత వైభవంగా ముగియడంతో.. దేవాదాయ శాఖ (ఎండోమెంట్) అధికారులు, ఆలయ సిబ్బంది సమక్షంలో అమ్మవారి హుండీలను తెరిచి లెక్కించారు.
ఈ హుండీ లెక్కింపు ద్వారా అమ్మవారికి మొత్తం 6 లక్షల26వేల226 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు.. తమ మొక్కుబడులు చెల్లించుకుని సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
