South Africa New Captain: ఆగస్టు 28వ తేదీ నుంచి విండ్‌హోక్ (Windhoek) వేదికగా నమీబియా, జింబాబ్వేలతో జరగనున్న ముక్కోణపు (Tri-Series) టీ20 టోర్నీతో పాటు నమీబియాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ పర్యటనకు మార్క్‌రమ్, బవుమా లాంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోర్న్ ఫార్చూన్ (Bjorn Fortuin) తొలిసారిగా దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
కొత్త ముఖాలకు ఛాన్స్:
దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ మార్కో జాన్సన్ కవల సోదరుడైన డోవాన్ జాన్సన్ (Duan Jansen) తో పాటు ఆల్‌రౌండర్ ఈథన్ బాష్‌లకు తొలిసారిగా సీనియర్ జట్టులో చోటు లభించింది. డోవాన్ జాన్సన్ ఇటీవల డొమెస్టిక్ లీగ్‌లో టైటాన్స్ తరఫున 16 వికెట్లతో పాటు ఫైనల్లో 61 రన్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు. కానర్ ఈస్టర్‌హుయ్‌జెన్, జోర్డాన్ హెర్మన్, నకోబానీ మోకోనాలకు తొలిసారిగా వన్డే జట్టు నుంచి పిలుపు వచ్చింది.
హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ కామెంట్స్:
రెండు సిరీస్‌లకు ఒకే జట్టును ఎంపిక చేయడంపై హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ మాట్లాడుతూ.. ఈ రెండు సిరీస్‌లకూ ఒకే జట్టును ఎంపిక చేశాం.. అన్ని విభాగాల్లో సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ ప్రాక్టీస్ పొందేందుకు యువ ఆటగాళ్లకు ఇదొక గొప్ప అవకాశం. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కానర్, నకోబానీ ప్రదర్శన చూశాం.. గాయంతో దూరమైన జోర్డాన్‌కు మళ్లీ అవకాశం రావడం సంతోషకరమని పేర్కొన్నారు.
* సిరీస్ తేదీలు మ్యాచ్ వివరాలు
* టీ20 ట్రై-సిరీస్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 నమీబియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య 6 లీగ్ మ్యాచ్‌లు + ఫైనల్
* 1వ వన్డే సెప్టెంబర్ 9 నమీబియా వర్సెస్ దక్షిణాఫ్రికా
* 2వ వన్డే సెప్టెంబర్ 11 నమీబియా వర్సెస్ దక్షిణాఫ్రికా
* 3వ వన్డే సెప్టెంబర్ 13 నమీబియా వర్సెస్ దక్షిణాఫ్రికా
🚨Squad Announcement🚨
— Proteas Men (@ProteasMenCSA) August 11, 2026
The South African Men’s selection panel has today announced the 15-player squad for the white-ball tour to Namibia later this month.
DP World Lions spinner Bjorn Fortuin will captain the side as the Proteas take on Namibia and Zimbabwe in a T20… pic.twitter.com/vsFeT1Vp84
