తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ ఎప్పుడు మొదలవుతుందా? హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారు? ఎవరు వైల్డ్ కార్డ్‌గా వస్తారు? అంటూ అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్10 సందడి మొదలు కానుంది.. దానికి ముందే 'అగ్నిపరీక్ష'తో అసలు హీట్ మొదలైపోయింది. రెండో సీజన్ 'అగ్నిపరీక్ష' ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది.
'అగ్నిపరీక్ష' కు 70 మంది షార్ట్‌లిస్ట్ ...
ఈసారి వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల నుంచి దాదాపు 70 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరికి వరుసగా టాస్కులు, ఇంటర్వ్యూలు, వివిధ రకాల ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ ఫైనల్‌గా టాప్ 15 మందిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత వారిలో నుంచి ఐదుగురు లేదా ఆరుగురికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే.. హౌస్‌లోకి వెళ్లే ముందు నుంచే కంటెస్టెంట్లకు అసలు గేమ్ మొదలైందన్నమాట.
జడ్జీలుగా వీరే..
లేటెస్ట్ గా విడుదలైన 'అగ్నిపరీక్ష' ప్రోమో ఈ ఉత్కంఠను మరింత పెంచింది. జడ్జీలుగా అభిజీత్, బిందు మాధవి, నవదీప్ కనిపిస్తూ కంటెస్టెంట్లను తమదైన స్టైల్లో టెస్ట్ చేస్తున్నారు.. శ్రీముఖి కూడా తన ఎనర్జిటిక్ కామెంట్స్‌తో షోకి మరింత మసాలా యాడ్ చేసినట్టు కనిపిస్తోంది. కొందరితో సరదాగా మాట్లాడుతూనే.. తప్పు అనిపించిన చోట జడ్జీలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.
►ALSO READ | జూనియర్ ఎన్టీఆర్‌కు మేజర్ సర్జరీ.. ఆగస్టు 12న కిమ్స్‌లో ఆపరేషన్!
ఓ కంటెస్టెంట్ రూల్స్‌ను ఉల్లంఘించినట్టుగా కనిపించడంతో శ్రీముఖి ‘మమ్మల్నే మోసం చేస్తావా?’ అంటూ ఫైర్ అయినట్టు ప్రోమోలో చూపించారు. మరో కంటెస్టెంట్ ఏకంగా అభిజీత్‌నే టార్గెట్ చేస్తూ.. బిగ్ బాస్ తర్వాత కొంతకాలం కనిపించలేదంటూ కౌంటర్ వేయడం ఆసక్తిని రేపింది. దీనికి అభిజీత్ కూడా సీరియస్‌గా స్పందిస్తూ రెడ్ సిగ్నల్ చూపించినట్లు తెలుస్తోంది.
రైతు బిడ్డగా అమ్మాయికి ఛాన్స్..
మరోవైపు రైతు బిడ్డ కేటగిరీకి ఈసారి ఓ అమ్మాయికి అవకాశం ఇచ్చేసినట్లు తెలుస్తోంది.. రివర్స్ రైటింగ్ వంటి ప్రత్యేక టాలెంట్‌తో వచ్చిన కంటెస్టెంట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫుల్ ఎనర్జీతో, ప్రత్యేక ప్రతిభతో ఆకట్టుకున్న వారిని తదుపరి దశకు పంపిస్తున్నట్లు సమాచారం.
