నా భర్తకు బుద్ధి చెడిపోయింది.. ఎయిర్ పోర్టులో గోవిందా-కోమల్ పై సునీత షాకింగ్ కామెంట్స్!

నా భర్తకు బుద్ధి చెడిపోయింది.. ఎయిర్ పోర్టులో గోవిందా-కోమల్ పై సునీత  షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ గా మారంది. ఇటీవల  ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి ఆయన కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లేటెస్ట్ విజువల్స్ వైరల్‌గా మారాయి. దీంతో వారి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై గోవిందా భార్య, నటి సునీతా అహూజా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారాయి.  కొందరు మీడియా ప్రతినిధులు  గోవిందా-కోమల్ కలిసి కనిపించడంపై సునీతను ప్రశ్నించగా.. ఆమె త్రీవంగా స్పందించారు. 'వినాశ కాలే విపరీత బుద్ధి' అనే సామెతను ప్రస్తావిస్తూ.. తన భర్తకు బుద్ధి చెడిపోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో సునీత మాటలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యాయి.

 

అంతేకాదు.. సోషల్ మీడియాలో కొందరు గోవిందాను ఆయన సూపర్‌హిట్ సినిమా 'హీరో నంబర్ 1'ను ఉద్దేశిస్తూ 'చీటర్ నంబర్ 1' అని పిలుస్తున్నారంటూ మీడియా చెప్పడంతో సునీత స్పందించిన తీరు మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రశ్నకు గోవిందా అభిమానులు, మీడియానే సమాధానం చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. తాను నిజం మాట్లాడితే ట్రోలింగ్, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

►ALSO READ | 'రంభ ఊర్వశి మేనక'ల కోసం 25 ఏళ్ల నిరీక్షణ.. అల్లరి నరేష్ మూవీ టీజర్ ఎలా ఉందంటే!

ఇక కోమల్ రాణి స్వర్ణకర్ గోవిందాతో కలిసి 'రూపా' అనే సినిమాలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి వరుస పబ్లిక్ అపియరెన్స్‌లు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే గోవిందా, కోమల్ తమ మధ్య ఉన్నది కేవలం ప్రొఫెషనల్ సంబంధమేనా, లేక మరేదైనా ఉందా అనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు గోవిందా-సునీత దంపతుల వ్యక్తిగత జీవితంపై గతంలోనూ పలు సందర్భాల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా సునీత చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ ఎపిసోడ్ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి..