యాదాద్రి భువనగిరి పదేండ్లుపాలించి దోచుకున్న సొమ్ముకోసం కేసీఆర్కుటుంబంలో అన్నాచెల్లి బంధాలను మర్చి ఆస్తుకోసం గొడవలు పడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క.
బీఆర్ ఎస్ పాలనలో చేసిన అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం..బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మురిగిపోయినట్లే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మున్సిపాలీటీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు సీతక్క.
భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంత్రి సీతక్క కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
