నాగార్జునసాగర్‌లో వైభవంగా సీఎం రేవంత్ వరుణ యాగం..

నాగార్జునసాగర్‌లో  వైభవంగా సీఎం రేవంత్  వరుణ యాగం..

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వరుణ యాగాన్ని నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో కృష్ణా నది ఒడ్డున ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది.

వరుణ యాగంలో భాగంగా అత్యంత కీలకమైన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పవిత్ర క్రతువులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

►ALSO READ | రెండేళ్లలో కేసీఆర్ సీఎం.. పెద్ది కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం: మాజీమంత్రులు కేటీఆర్ , హరీశ్

ఇవాళ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన ఈ మహా యాగం, సాయంత్రం కాసేపట్లో ఘనంగా ముగియనుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో... రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు చెందిన అర్చకులు, ఏకంగా 108 మంది ఋత్వికులు ఈ యాగంలో పాలుపంచుకున్నారు.

ప్రత్యేక యాగశాల ఏర్పాట్లు

కృష్ణా నది ఒడ్డున ఉన్న నాగార్జునసాగర్ విజయవిహార్ వెనుక ప్రాంతంలో ప్రత్యేకంగా యాగశాలను తీర్చిదిద్దారు. భారీ పందిరితో పాటు యజ్ఞవేదికలు, పగోడాలు, ప్రవచనశాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా, యాగాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు.