యాదాద్రి, వెలుగు : గుడిసెల్లో నివాసమున్న వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని యాదాద్రి ఇన్చార్జి కలెక్టర్ ఏ భాస్కరరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఇండ్ల నిర్మాణ ప్రగతిపై నిర్వహించిన రివ్యూలో లబ్ధిదారుల ఎంపిక, మంజూరు, నిధుల విడుదలపై ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
