ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం.. సోషల్ మీడియా ప్రచారంపై FSL డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం.. సోషల్ మీడియా ప్రచారంపై FSL డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
  • ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
  • ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఆధారాలను రిట్రీవ్ చేస్తున్నం
  • ఓటుకు నోటు కేసు యథావిధిగా నడుస్తోంది. మెటీరియల్స్ అన్ని ఇప్పటికే కోర్టుకు సమర్పించాం. 
  • ప్రమాద సమయంలో ఆఫీసులో ఎవరెవరున్నారన్న దానిపై ఆరా తీస్తున్నం
  • ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్

హైదరాబాద్: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎస్ఎ స్ఎల్ డైరెక్టర్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు అన్నీ సేఫ్ గా ఉన్నాయని, ఇప్పటికే కొన్ని మెటీరియల్స్​ కోర్టుకు సమర్పించామని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

'అగ్నిప్రమాదం సమయంలో ఆఫీసులో ఎవరెవరు ఉన్నారు. అనే దానిపై ఆరా తీస్తున్నం. దయచేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మొ ద్దు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణసీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమా పక సిబ్బంది చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి..2013లో ఏసీబీకి సంబందించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసమయ్యాయి. 

దీనికి సం బంధించిన మెటీరియల్స్ 2021లోనే ఏసీబీ కోర్టులో డిపాజిట్ చేశాం. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను అట్రెడ్ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చింది. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధా రాలతో ఎలాంటి నష్టం లేదు. ఓటుకు నోటు కేసులో యధావిధిగా నడుస్తుంది. 2024లో పంజాగుట్ట పోలీసు స్టేషన్​ కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎస్ఏసిల్​ కి  వచ్చాయి. ప్రమాదంలో 7 మెటీరియల్స్ కాలిపోయాయి. వీటిని రిట్రీవ్ చేస్తం. అగ్ని ప్రమా దంపై విచారణ జరుగుతోంది' అని తెలిపారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్ కుట్ర

హైదరాబాద్: నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిసమాదం వెనుక ఆధారాలను కప్పిపుచ్చే ప్రయత్నం ఏమైనా ఉంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీని వెనుక కేటీఆర్ హస్తంఉంది ఏమోనని నాకు అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోరె నిసింక్ ల్యాబ్లో ఫోన్ ట్యాపింగ్ టేపులు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాలు ఉన్నాయని అందుకే కేటీఆర్ ముందే వచ్చి రేవంత్ రెడ్డిపై అభాండాలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

'మీ చరిత్ర గతంలో తెలంగాణ ప్రజలు చూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపో గానే ఎస్బ్బఆఫీస్లో సీసీ కెమెరాలు బంద్ చేసి ఇజ్రాయిల్ నుంచి తెచ్చిన పరికరాలు, ఫైల్స్ మొత్తం ధ్వంసం చేసి మూసీ నదిలో పారేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ కుటుంబం విచారణ ఎదుర్కొంటుంది. అందువల్ల ఫోరెన్సిక్ ల్యాబ్ వెనుక కుట్ర ఉంటే అది కేటీఆర్ వైపు నుంచే ఉంటుంది. 

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ వీపు చింతపండు చేస్తారని కేటీఆర్​ కు  అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిపై విష ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని చిల్లర ప్రచారం చేస్తున్నారు. బావ బావమరిది ఇద్దరూ కలిసి పొద్దున ఒకరు, మధ్యాహ్నం మరొకరు, సాయంత్రం ఒకరు ప్రెస్ మీట్, ట్విట్టర్, చిట్ చాట్ పేరుతో ప్రజలను చీట్ చేస్తున్నరు 'అని అన్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేయించాలి

భద్రాద్రి కొత్తగూడెం: పోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలకు సంబంధించిన ఫైల్స్ కాలిపోవడం కుటేనని ఆరోపించారు. కొత్తగూడెం మున్ని పల్ కార్పొరేషన్లో ఆయన తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం పరేండ్లు నిర్లక్ష్యం చేసింద న్నారు. రెండు పార్టీలని ఒకే విధానాలని విమర్శించారు. 

రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టిందని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలలో ఒక్కటి మినహా హామీలు విఫలం అయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రెండు ప్రభుత్వాలు దారి మళ్లించాయని ఆరోపించారు. రాష్ట్రానికి సీఎం రేవంత్హువు, మాజీ సీఎం కేసీఆర్ కేతువు అని పేర్కొన్నారు. రాష్ట్ర కేబినెట్ లో డీసీల లెక్క తేల్చాలని డిమాండ్ చేసిన బీజేపీ చీఫ్- సభలో సభ్యత్వం లేకుండా ముస్లింక్ మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ లో వర్గపోరుతోనే కుంభకోణాలు బయట పడ్డాయన్నారు.. సింగరేణి కార్మికుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.