హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా, సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరోకోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
అలాగే, పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో 25 లక్షలు రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మొత్తం 2 కోట్ల 25 లక్షల రూపాయలను పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం అందించనుంది. అలాగే, పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
ALSO READ : 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో..
ఈ మేరకు పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నేతలు పెద్ది కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారనీ, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
